NTV Telugu Site icon

“పుష్ప”రాజ్ కు హిందీ డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?

Pushpa

Pushpa

సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప ది రైజ్’ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్‌లో అల్లు అర్జున్‌ పాత్ర పుష్ప జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. నిన్న “పుష్ప” ట్రైలర్ ను హిందీలోనూ అజయ్ దేవగన్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ కు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అల్లు అర్జున్ రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం, ఆయన స్టైల్, లుక్స్, రష్మికతో రొమాంటిక్ ట్రాక్ బన్నీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హిందీలో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరు ? అనే విషయంపై చర్చ జరుగుతోంది. “పుష్ప”రాజ్ హిందీ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పింది ఓ హిందీ నటుడు.

Read Also : “ఆర్ఆర్ఆర్” కొత్త ప్రోమో… ట్రైలర్ పై అంచనాలను పెంచేస్తున్న టీమ్

హిందీలో ట్రైలర్‌ కు అల్లు అర్జున్ వాయిస్ ఓవర్‌ని బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే అందించారు. ఈ విషయాన్నీ స్వయంగా శ్రేయాస్ సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. హిందీలో “పుష్ప ది రైజ్ ట్రైలర్‌”ను విడుదల చేస్తూ “పుష్ప” (హిందీ)లో భారతదేశపు అత్యంత పవర్ ఫుల్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి గాత్రదానం చేసినందుకు సంతోషం, గౌరవంగా ఉంది” అని ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కు తగినట్టుగా డబ్బింగ్ చెప్పడానికి తనవంతుగా ప్రయత్నించానని ఆయన అన్నారు. దీంతో అల్లు అర్జున్ కు హిందీలో డబ్బింగ్ చెప్పింది ఆయనే అనే విషయం అధికారికంగా రివీల్ అయ్యింది.

Shreyas Thalpade

శ్రేయాస్ హిందీతో పాటు మరాఠీ చిత్రాలలో కూడా నటిస్తాడు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు చిత్ర దర్శకుడు, నిర్మాత కూడా. ‘ఓం శాంతి ఓం’ (2007), గోల్‌మాల్ రిటర్న్స్ (2008), గోల్‌మాల్ 3 (2010), హౌస్‌ఫుల్ 2 (2012), గోల్‌మాల్ ఎగైన్ (2017)తో సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఇటీవలే ఆయన ‘లయన్ కింగ్’ మూవీ హిందీ వెర్షన్ కు కూడా దుబ్బింగ్ చెప్పాడు. కాగా శ్రేయాస్ ఒక తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి.

కాగా సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప” రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప: ది రైజ్”అనే టైటిల్‌తో డిసెంబర్ 17న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాతోనే మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ తెలుగు అరంగేట్రం చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.