Site icon NTV Telugu

Ramya Ragupathi: కృష్ణ గారిని నేను లాగలేదు.. నరేష్ ఆయనను బురదలోకి లాగాడు

Ramya

Ramya

Ramya Ragupathi:సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. ఇక వీరి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి శపథం చేసిన విషయం కూడా విదితమే. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు తన బంధాన్ని కాపాడుకోవడానికి మీడియా ముందుకు వచ్చింది. నరేష్ బండారాన్ని బయటపెట్టింది. గత కొన్నిరోజులుగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నరేష్ బాగోతాన్ని బయటపెట్టింది. ఇక తాజాగా ఆమె ఎన్టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన మనోగతాన్ని చెప్పుకొచ్చింది. నరేష్ తన మీద వేసిన ఆరోపణల దగ్గరనుంచి పవిత్ర- నరేష్ ల పరిచయం, ప్రేమ, పెళ్లి వరకు అసలు మధ్యలో ఏం జరిగిందో మొత్తం పూసా గుచ్చినట్లు చెప్పుకొచ్చింది.

నరేష్ తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, రెండేళ్లు పెళ్లి చేసుకోమని తన వెంట పడినట్లు ఆమె తెలిపింది. తనపై ప్రేమతోనా, రాజకీయ పరంగా ఏమైనా ఎజెండా ఉందా అని అప్పుడే అడిగితే నువ్వే నా దేవత, భాగ్యలక్ష్మి అని కబుర్లు చెప్పి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఇక ఇన్ని చేసినా తన కొడుకు కోసం తాను అతనికోసం పోరాడుతున్నట్లు చెప్పిన రమ్య తన కొడుకు, నరేష్ వలన ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చింది. తన కొడుకు స్నేహితులు, స్కూల్ లో వారు అతనికి కాల్ చేసి మీ నాన్న పెళ్లి అంటగా, మీ అమ్మ దొంగ అంటగా అంటూ చెప్తుంటే ఆ పిల్లాడి మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఊహించండి అని చెప్పిన ఆమె తన కొడుకుకు తండ్రి కావాలని అందుకే ఈ పోరాటం చేస్తున్నట్లు తెలిపింది.

ఇక నరేష్- పవిత్ర లిప్ లాక్ వీడియో గురించి ఆమె మాట్లాడుతూ.. “ఆ వీడియో చూసి నేనేమి షాక్ అవ్వలేదు.. ఇలాంటి కిస్సింగ్ సీన్స్ నేను చాలా చూసేశాను. కాకపోతే అమ్మాయిలే మారుతూ ఉంటారు” అని చెప్పుకొచ్చింది. ఇక కృష్ణగారిని తానూ ఈ విషయంలోకి లాగలేదని, ఆయన ఈ బురదలో కాలు పెట్టాలని అనుకోలేదని తెలిపింది. నరేష్ కావాలనే ఇదంతా చేసినట్లు చెప్పిన రమ్య.. కృష్ణ గారికి అన్ని తెలిసి కూడా మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చింది. కృష్ణ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి పిటిషన్ వేశాడని, ఈ విషయం కృష్ణగారికి కూడా తెలియలేదని చెప్పింది. ఇక ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని, నరేష్ తో తనకు విడాకులు వద్దని, తన కొడుకుకు తండ్రి మాత్రమే కావాలని చెప్పుకొచ్చింది. పవిత్ర- నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటారో తానూ చూస్తానని రమ్య తెలిపింది.

Exit mobile version