టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పుడు కొత్త ఛాలెంజ్ తో తనను తానే సవాలు చేసుకుంటున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ ఛాలెంజ్ గురించి వెల్లడించాడు. “ఇంతకుముందు నాకు చాలా మంచి బాడీ ఉందని అనుకునే వాడిని. లేజీనెస్ వల్ల అంతా పోగొట్టుకున్నాను. జనవరి నుంచి ఛాలెంజ్ స్టార్ చేయబోతున్నా… నెక్స్ట్ 60 డేస్… లాస్ట్ ఇయర్ ఎక్కడ వదిలేసానో అక్కడే స్టార్ట్ చేస్తా… పని ఎక్కువ ఉంది, కుదరలేదు ఇలా ఎన్ని చెప్పినా అవన్నీ సాకులు మాత్రమే. మైండ్ స్ట్రాంగ్ చేసుకుంటాను” అంటూ తాను తీసుకోబోతున్న 60 డేస్ ఛాలెంజ్ గురించి వెల్లడించాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నెక్స్ట్ 60 డేస్ కోసం మేము వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి!
కాగా ప్రస్తుతం మంచు విష్ణు చేతిలో “ఢీ అండ్ ఢీ” అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మోహన్ బాబు నటిస్తున్న “సన్ ఆఫ్ ఇండియా” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020లో ఆయన నటించిన మోసగాళ్లు, చదరంగం చిత్రాలు విడుదల కాగా వాటికి విభిన్నమైన స్పందన వచ్చింది.
A post shared by Vishnu Manchu (@vishnumanchu)