టాలీవుడ్ యంగ్ హీరేమో చైతన్య కృష్ణ పేరు అంతగా తెలియకపోయినప్పటికీ ఆయన ఫేస్ అయితే టాలీవుడ్ లో చాలా నోటెడ్. ఈమధ్య హాట్ స్టార్ లో విడుదలైన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ లో భార్య బాధితుడిగా కనిపించి మెప్పించిన చైతన్య కృష్ణ 2009లో సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వర రావు తెరకెక్కించిన నిన్ను కలిశాక అనే సినిమాతో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు. స్నేహగీతం తర్వాత అది నువ్వే సినిమాతో హీరోగా మారి నటన మీద ఆసక్తితో జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి అంకితం అయిపోయాడు.
Zareen Khan: హాస్పిటల్ పాలైన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే?
వైవిధ్య భరితమైన పాత్రలు చేసి నటుడిగా నిరూపించుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకుంటూ ఒక వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు కథలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్య. ఇక తాజాగా రోటరీ క్లబ్ మనోజ్ఞ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా కృష్ణ చైతన్య ఎంపికయ్యాడు. వందేళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ సంస్థ తాజాగా ఈ మెంటల్ హెల్త్ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మనోజ్ఞ పేరుతో వరుస కార్యక్రమాలు చేపట్టింది. ఈ మనోజ్ఞ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ యాక్టర్ కృష్ణ చైతన్యను రోటరీ ఎంపిక చేసుకుంది. ఇలాంటి మంచి సామాజిక సేవా కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎంపికవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కృష్ణ చైతన్య వెల్లడించారు.