Singer Mangli Responds on Her Accident News: ప్రముఖ సింగర్ మంగ్లీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని ఈ ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంగ్లీ సహా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుందని డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరిగింది. రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయాలయ్యాయని వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు, ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు, కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది’ అని వారు తెలిపారు.
OTT Movies: సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
ఇక రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి శనివారం హాజరయిన మంగ్లీ అదే రోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషాబాద్ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనుక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టగా కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఈ అంశం మీద కూడా మంగ్లీ స్పందించింది. ప్రియమైన అం అందరికీ, నేను సేఫ్ గా ఉన్నాను, బాగున్నాను. వార్తల్లో మీరు వింటున్నది ఒక చిన్న యాక్సిడెంట్. అది కూడా రెండు రోజుల క్రితం జరిగింది. మీరు ఈ విషయంలో ఎలాంటి రూమర్స్ నమ్మకండి, మీ ప్రేమకు ధన్యవాదాలు అని ఆమె రాసుకొచ్చింది.