మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండడమే కాక ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈపాటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇటీవల ఫిబ్రవరిలో కూడా కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మరో కొత్త డేట్ ని ప్రకటిస్తామని తెలిపి మరోసారి వాయిదా వేశారు మేకర్స్. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా మరో కొత్త డేట్ ని లాక్ చేసినట్లు మేకర్స్ తెలిపారు.
ఏప్రిల్ 1 న ఆచార్య రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “ఈ ఉగాది పెద్దతెరపై మెగా మాస్ సాక్ష్యంగా నిలబడుతుంది.. ఆచార్య ఏప్రిల్ 1 న రిలిజ్ అవుతుంది” అని తెలిపారు. దీంతో పాటు మెగాస్టార్ కొత్త పోస్టర్ ని రిలిఙ్ చేశారు. చేతిలో గొడ్డలి పట్టుకొని ఉగ్ర రూపంలో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. మరి ఈ ఏప్రిల్ లోనైన ఈ సినిమా విడుదల కానుందా..? లేదా అనేది చూడాలి.
