Abhiram Daggubati: రానా నన్నెప్పుడు తమ్ముడిలా చూడలేదు.. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు అన్న మాటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhiram Daggubati: దగ్గుబాటి ఇంట్లో విబేధాలు మొదలయ్యాయి అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి బ్రదర్స్.. రానా, అభిరామ్ లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రానా పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక అభిరామ్ ఈ ఏడాది అహింస చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత అభిరామ్ కొంత గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్ లో అభిరామ్ రైటర్స్ కేఫ్ పేరిట హైదరాబాద్‌లో ఓ కేఫ్ ప్రారంభించాడు. అయితే ఈ వ్యాపారం కోసం ఇంట్లోవారిని కూడా అభిరామ్ ఎదురించాడు అని టాక్. అంతేకాకుండా అభిరామ్ ను ఇంట్లో నుంచి గెంటేశారు అని కూడా పుకార్లు వచ్చాయి. ఇక తాజాగా ఈ వార్తలపై అభిరామ్ స్పందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిరామ్ .. తన కుటుంబానికి, తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు.
Deepika Padukone : లేడీ సింగం గా అదరగొడుతున్న దీపికా పదుకొణె..
Also Read
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
“నన్ను.. నా కుటుంబం ఇంట్లో నుంచి గెంటేశారు అనేది వాస్తవం కాదు. లైఫ్ అంటే ఈజీ కాదని, వయస్సు పెరిగేకొద్దీ తెలిసివచ్చింది. ముఖ్యంగా తాతయ్య చనిపోయినప్పుడు జీవితం విలువ తెలిసొచ్చింది.. కొన్ని బాధ్యతలు తెలిసి వచ్చాయి. నా కాళ్ల మీద నేను నిలబడాలి అనుకున్నాను. అందుకే కేఫ్ ఒకటి ప్రారంభించాను. కేఫ్ స్టార్ట్ చేయడం వల్ల ఇంట్లోవాళ్లు కోప్పడి నన్ను ఇంటి నుంచి వెళ్లిపోమన్నారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నిజానికి నాన్న, అన్నయ్య, బాబాయ్ నాకు రకరకాల సలహాలిస్తూ ఎంతగానో సాయం చేశారు. వ్యాపారం ఎలా చేయాలనేది నాన్న దగ్గరి నుంచి నేర్చుకున్నాను. కేఫ్ ఎలా నడపాలన్నది అన్న చెప్తూ ఉంటాడు. రానా అన్నకు నాకు పదేళ్లు గ్యాప్ ఉంది. అన్న.. నన్నెప్పుడు తమ్ముడిలా కాదు స్నేహితుడులా చూస్తాడు. సినిమా అవకాశాలు వస్తున్నాయి.. కానీ, నేనే కొంత గ్యాప్ తీసుకుంటున్నాను. ఇక నా పెళ్లి విషయం మొత్తం నా కుటుంబంకే వదిలేసాను. వాళ్లకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!