Deepika Padukone : లేడీ సింగం గా అదరగొడుతున్న దీపికా పదుకొణె..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుస సినిమాలతో అదరగొడుతుంది.ఇటీవల పఠాన్ మూవీతో అదిరిపోయే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. జవాన్ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగం ఎగైన్..రోహిత్ శెట్టి మొదటిసారిగా కాప్ యూనివర్స్ లోకి ఫీమెల్ లీడ్ రోల్‌తో సినిమా చేస్తున్నాడు. సింగ్ ఎగైన్‌గా వస్తున్న సినిమాలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది.. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశాడు రోహిత్ శెట్టి. ఇందులో దీపికా పదుకొణె లుక్ అదిరిపోయింది. పోలీస్ యూనిఫార్మ్ లో విలన్లు రఫ్ఫాడించి వారిపై కూర్చుని దీపికా ఇచ్చిన పోజ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.
డేరింగ్ స్మైల్ తో విలన్‌లు గుండెలు అదిరేలా దీపికా లుక్ మెస్మరైజ్ చేస్తోంది.విలన్ నోట్లో గన్ పెట్టి, తన తలకు గన్ పెట్టుకుని పోలీస్ డెవిల్‌లా దీపికా స్మైల్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ షేర్ చేసిన రోహిత్ శెట్టి “మహిళ సీత రూపంలోనే కాదు దుర్గ అవతారం కూడా ఎత్తుతుంది. మా కాప్ యూనివర్స్ లోకి అడుగు పెట్టిన అతి క్రూరమైన, భయంకర పోలీస్ ఆఫీసర్ శక్తి శెట్టిని చూడండి. నా లేడీ సింగం దీపికా పదుకొణె” అని ఆయన రాసుకొచ్చాడు.కాగా రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో ఇదివరకు అజయ్ దేవగన్ (సింగం)అలాగే రణ్‌వీర్ సింగ్ (సింబా) మరియు అక్షయ్ కుమార్ (సూర్యవంశీ)తో సినిమాలు తెరకెక్కించాడు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ మహిళా ప్రాధాన్యత చిత్రంగా సింగం ఎగైన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రోహిత్ శెట్టి. కేవలం ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమా లో దీపికా క్యారెక్టర్ ఎలా ఉంటుందో రివీల్ చేశాడు రోహిత్ శెట్టి..దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
Also Read
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!