NTV Telugu Site icon

Abhiram Daggubati: రానా నన్నెప్పుడు తమ్ముడిలా చూడలేదు.. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు అన్న మాటలు..

Ranaa

Ranaa

Abhiram Daggubati: దగ్గుబాటి ఇంట్లో విబేధాలు మొదలయ్యాయి అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి బ్రదర్స్.. రానా, అభిరామ్ లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రానా పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక అభిరామ్ ఈ ఏడాది అహింస చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత అభిరామ్ కొంత గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్ లో అభిరామ్ రైటర్స్‌ కేఫ్‌ పేరిట హైదరాబాద్‌లో ఓ కేఫ్‌ ప్రారంభించాడు. అయితే ఈ వ్యాపారం కోసం ఇంట్లోవారిని కూడా అభిరామ్ ఎదురించాడు అని టాక్. అంతేకాకుండా అభిరామ్ ను ఇంట్లో నుంచి గెంటేశారు అని కూడా పుకార్లు వచ్చాయి. ఇక తాజాగా ఈ వార్తలపై అభిరామ్ స్పందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిరామ్ .. తన కుటుంబానికి, తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు.

Deepika Padukone : లేడీ సింగం గా అదరగొడుతున్న దీపికా పదుకొణె..

“నన్ను.. నా కుటుంబం ఇంట్లో నుంచి గెంటేశారు అనేది వాస్తవం కాదు. లైఫ్ అంటే ఈజీ కాదని, వయస్సు పెరిగేకొద్దీ తెలిసివచ్చింది. ముఖ్యంగా తాతయ్య చనిపోయినప్పుడు జీవితం విలువ తెలిసొచ్చింది.. కొన్ని బాధ్యతలు తెలిసి వచ్చాయి. నా కాళ్ల మీద నేను నిలబడాలి అనుకున్నాను. అందుకే కేఫ్ ఒకటి ప్రారంభించాను. కేఫ్‌ స్టార్ట్‌ చేయడం వల్ల ఇంట్లోవాళ్లు కోప్పడి నన్ను ఇంటి నుంచి వెళ్లిపోమన్నారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నిజానికి నాన్న, అన్నయ్య, బాబాయ్‌ నాకు రకరకాల సలహాలిస్తూ ఎంతగానో సాయం చేశారు. వ్యాపారం ఎలా చేయాలనేది నాన్న దగ్గరి నుంచి నేర్చుకున్నాను. కేఫ్‌ ఎలా నడపాలన్నది అన్న చెప్తూ ఉంటాడు. రానా అన్నకు నాకు పదేళ్లు గ్యాప్ ఉంది. అన్న.. నన్నెప్పుడు తమ్ముడిలా కాదు స్నేహితుడులా చూస్తాడు. సినిమా అవకాశాలు వస్తున్నాయి.. కానీ, నేనే కొంత గ్యాప్ తీసుకుంటున్నాను. ఇక నా పెళ్లి విషయం మొత్తం నా కుటుంబంకే వదిలేసాను. వాళ్లకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.