Abbas: ఆమె నన్ను మోసం చేసింది.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abbas: అబ్బాస్.. ఈ పేరు ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ, 90వ దశకంలో ఉన్న యువతను అడగండి.. అబ్బాస్ అంటే ఎవరో.. అతనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్తారు. ప్రేమదేశం సినిమా చూసాకా అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని అమ్మాయిలు.. ఇలాంటి స్నేహితుడు కావాలని అబ్బాయిలు.. అబ్బాస్ కటింగ్ కావాలని స్టూడెంట్స్.. ఓ రేంజ్ లో పోటీపడేవారు. ఆ తరువాత ఎన్నో మంచి సినిమాలు తీసి మెప్పించిన అబ్బాస్.. సినిమా అవకాశాలు తగ్గాక హార్పిక్ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి.. హార్పిక్ అబ్బాస్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక గత కొన్నేళ్లుకు ముందు అబ్బాస్ ఇండియాను వదిలేసి.. న్యూజిలాండ్ లో కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిలయ్యాడు. ఇక ఈ మధ్యనే ఒక చిన్న ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న అబ్బాస్.. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్ తన జీవితంలో జరిగిన ఒక చేదు ఘటనను అభిమానులతో పంచుకున్నాడు.
Urfi Javed: నువ్వు.. ఇంతకుమించి దిగజారవు అన్న ప్రతిసారి.. యూ ప్రూవ్ మీ రాంగ్
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
” టీనేజ్ అంతా ఏదో గందరగోళంగా నడిచింది. ఆ సమయంలో నాకు ఏది తెలియలేదు. టీనేజ్ లో ఉన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది. వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో నాకు అస్సలు బతకాలనిపించలేదు. రోడ్డు మీద ఓ ట్రక్ ఎదురుగా నిలబడ్డాను. కానీ దాని వెనకాలే బైక్ పై వస్తున్న వ్యక్తిని చూసి.. పక్కకు తప్పుకొన్నాను. ఎందుకంటే నన్ను ట్రక్ గుద్దేస్తే, అతడు దాన్ని ఢీ కొట్టి గాయపడతాడు అనిపించింది. ఆ బైకర్ వలనే నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను. నేను చిన్నతనం నుంచి అంతే.. ప్రాణం పోతున్నా పక్కవాళ్ళ గురించే ఆలోచిస్తాను. ఎవరికైనా సాయం చేస్తే.. ఫలితం ఆశించకండి.. అదే నేను చెప్తాను. సినిమాల్లో అవకాశాలు తగ్గాక నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!