Site icon NTV Telugu

సమంత కోసం నిర్మాతగా స్టార్ హీరోయిన్

Samantha

Samantha

గత కొంత కాలంగా సమంత బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. సామ్ తన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ సౌత్ తో పాటు నార్త్ లోనూ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. సామ్ అభినయానికి, ఆమె పోషించిన పాత్రకు అక్కడ మంచి ప్రజాదరణ దక్కింది. ప్రస్తుతం సామ్ హిందీ చలనచిత్ర పరిశ్రమలోకి పూర్తిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్కెట్‌ను విస్తరించుకోవాలని భావిస్తోంది. అయితే బాలీవుడ్ లో సామ్ నటించబోయే చిత్రానికి మరో స్టార్ హీరోయిన్ నిర్మాతగా వ్యవహరిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.

Read Also : 100 రోజులు పూర్తి చేసుకున్న “ఆదిపురుష్”

మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో మెయిల్ రోల్ కోసం సామ్ ను సంప్రదించారట మేకర్స్. ఈ ఏడాది ప్రారంభంలో తాప్సీ తన ప్రొడక్షన్ హౌస్ అవుట్‌సైడర్ ఫిల్మ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ బ్యానర్ నుంచి సమంతకు ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

తాప్సీ తొలి ప్రొడక్షన్ వెంచర్ “బ్లర్” షూటింగ్ ఇటీవలే పూర్తయింది.’సెక్షన్ 375′ ఫేమ్ అజయ్ బహల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు సమంత తదుపరి తమిళ చిత్రం ‘కథు వాకులా రెండు కాదల్‌’లో కనిపించనుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సమంత డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో మరో ద్విభాషా ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది. ఇది త్వరలో సెట్స్‌పైకి రానుంది. తెలుగులో ఆమె తాజా చిత్రం ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధం అవుతోంది.

Exit mobile version