Site icon NTV Telugu

Official : ఇది కదా న్యూస్ అంటే.. రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్.. రోలెక్స్ 2.O

Untitled Design (28)

Untitled Design (28)

కొన్ని కొన్ని కాంబినేషన్ లు పేర్లు వింటేనే ఆడియెన్స్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఇద్దరు బడా స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడతాయి. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఎంతటి సంచలం నమోదు చేసిందో చూసాం. ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ సినిమాలు మళ్ళి  ఉపందుకుంటున్నాయి. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ బాలీవుడ్ హీరో సల్మాన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేశారు. మళయాల నటుడు పృధ్వి రాజ్ సుకుమారన్ సలార్ లో ముఖ్య పాత్రలో కనిపించాడు.

Also Read: sree leela : తమిళంలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల

ఇదిలాఉండగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ భారీ ముల్టీస్టారర్ తెరకెక్కుతోంది. తమిళ సూపర్ స్టార్ రాజనీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో జరుగుతుంది. అయితే బాలీవుడ్ బడా ఖాన్ లలో ఒకరైన అమీర్ ఖాన్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తోంది. ఈ వార్త అక్కడ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది అదే జరిగితే బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం అని చర్చించుకుంటున్నాయి తమిళ సినిమా వర్గాలు. మరోవైపు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూలీ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా నటిస్తున్నాడని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే అమీర్ ఖాన్ వార్త పై అధికారక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది

Exit mobile version