Site icon NTV Telugu

RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్

RRR

RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు. అమీర్ ఖాన్ కు ఎన్టీఆర్ స్టెప్పులు వివరించగా, ఆ తరువాత ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేయడం అభిమానులకు కన్నుల పండగగా మారింది.

Read Also : RRR Event : ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ రివీల్ చేసిన రాజమౌళి

RRR చిత్రం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలతో తెరకెక్కుతున్న కల్పిత చిత్రం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ టైటిల్ రోల్స్ పోషిస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రకని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ కికలకపాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version