6న ఆది పినిశెట్టి ‘క్లాప్’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పోస్టర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. పారా ఒలింపిక్స్ లో భారతదేశం మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నందున ఈ సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమా కోసం ఆది పినిశెట్టి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తుండగా, కృష్ణ కురుప్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి, మునిష్కాంత్ కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, విడుదలకు సిద్ధంగా ఉందని నిర్మాతలు తెలిపారు. ప్రముఖ గీత రచయిత వనమాలి ఈ సినిమాకు మాటలు రాయడం విశేషం.
Also Read
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!