Amala Paul: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం విదితమే. ఇక కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు తనను మోసం చేశాడని, లైంగిక వేధింపులకు గురిచేశాడని భవ్నీందర్ సింగ్ దత్ పై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతడిని వెతికి అరెస్ట్ చేశారు. ఇక్కడితో ఈ కేసు ముగిసింది అనే అనుకున్నారు అంతా.. అయితే భవ్నీందర్ సింగ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ లో అసలు నిజాలు బయటపడ్డాయి. అమలా పాల్ ఎంత డ్రామా ఆడిందో ఆటను చెప్పుకొచ్చాడు. తాము ఐదేళ్ల క్రితమే పెళ్లిచేసుకున్నామని, విబేధాలు తలెత్తడంతో ఆమె తనను లైంగిక వేధింపులు కేసులో ఇరికించిందని చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
కోర్టులో అతను మాట్లాడుతూ “2017 లో మేము ఇద్దరం పంజాబీ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నామని, ఆ తరువాత ఒక ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టామని తెలుపుతూ ఫోటోలు, వీడియోలను కోర్టుకు సమర్పించాడు. కొన్ని విభేదాలు రావడంతో ఆమె తనను వదిలించుకోవడానికి ఇలాంటి కేసు పెట్టిందనిఇప్పటికీ మేము భార్యాభర్తలమే అని చెప్పుకొచ్చాడు. దీంతో అతని వాదన విన్న కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఇక దీంతో మొన్న అమలా చెప్పిన విషయమంతా అబద్దమని తెలుస్తోంది. అతడితో పెళ్లి జరగలేదని, డబ్బుకోసం తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు అమ్మా.. మహానటి.. నీ నటనకు ఆస్కార్ కూడా ఇవ్వొచ్చు అని కొందరు.. ఇంత మోసమా అని మరికొందరు తమిళనాట చర్చించుకుంటున్నారట. మరి ఈ విషయమై అమలా పాల్ ఏమంటుందో చూడాలి.