Site icon NTV Telugu

Akhil Akkineni : వైజాగ్ లో “ఏజెంట్”కు గ్రాండ్ వెల్కమ్

Akhil

Akhil

యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన రాబోయే చిత్రం “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. “ఏజెంట్” షూటింగ్ కోసం ఈరోజు ప్రత్యేక విమానంలో వైజాగ్‌ వెళ్లిన అఖిల్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కినేని నటుడికి స్వాగతం పలికేందుకు అఖిల్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అఖిల్ ను స్వాగతించడానికి అక్కినేని అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడం ఆసక్తికరంగా మారింది. అఖిల్ వైజాగ్ ఎంట్రీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Also : KGF 2 : బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా ? యష్ ఏమన్నాడంటే?

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఆగస్ట్ 12న విడుదల కానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి హిప్ హాప్ తమిజా సంగీత దర్శకుడు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. గత ఏడాది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అఖిల్ కు “ఏజెంట్”తో పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగాడు. మరి “ఏజెంట్”తో అఖిల్ మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Exit mobile version