2012లో బర్ఫీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక చోప్రా, ఆ తర్వాత ఇండియన్ సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చింది. 2019లో ది స్కై ఈజ్ పింక్ చేసింది. తర్వాత 2021లో ది వైట్ టైగర్ సినిమాలు చేసినా, ఇవి కూడా లాంగ్ గ్యాప్ తర్వాతే. సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత, ప్రియాంక ఎక్కువగా హాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా, హాలీవుడ్‌లో ఒక్క కమర్షియల్ హిట్ కూడా దక్కలేదు. అక్కడ స్టార్‌గా గుర్తింపు రావడం… అంత ఈజీ కాదని ప్రియాంక కెరీర్ స్పష్టంగా చూపించింది.
Also Read : Salaar 2 : రిపబ్లిక్ డే రోజు ప్రభాస్ ‘సలార్ 2’ అప్డేట్ రాబోతోందా?
ఇప్పుడు ప్రియాంక లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ రీసెంట్ గా ట్రయిలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేసి, ఫిబ్రవరి 25న డైరెక్ట్‌గా ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రిలీజ్ కాబోతోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో, ప్రియాంక “బ్లడీ మేరీ” అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఒకప్పుడు పేరుమోసిన దొంగ… ఇప్పుడు కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలనుకునే మహిళ… కానీ ఆమె గతాన్ని మర్చిపోని శత్రువులు వెంబడిస్తుంటే, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ యుద్ధానికి దిగే బ్లడీ మేరీగా ప్రియాంక ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమెతో పాటు హాలీవుడ్ నటుడు కార్ల్ అర్బన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. హాలీవుడ్ తర్వాత… ఇప్పుడు ప్రియాంక అసలైన రీఎంట్రీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్. మహేశ్ బాబు హీరోగా, దర్శకుడు S. S. రాజామౌళి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో ప్రియాంక “మందాకిని” అనే పాత్రలో నటిస్తోంది. టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో కూడా ప్రియాంక పాత్ర యాక్షన్ ఓరియెంటెడ్‌గానే ఉండనుంది. అంటే హాలీవుడ్ అయినా… టాలీవుడ్ అయినా… ప్రియాంక చోప్రా ఇప్పుడు యాక్షన్స్ కే ప్రయారిటీ ఇస్తోంది. స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటోంది.
