A NRI offered 1000 crore to me if Im ready to make movies on Itihasas says Prasanth Varma: ముందుగా చిన్న సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన హనుమాన్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిందో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అందరూ నమ్మారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సినిమా కూడా బాగుండడంతో హనుమాన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. ఇప్పటికే దాదాపు 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా 300 కోట్ల రూపాయలు క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఈ మధ్యనే మొదలు పెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా మళ్లీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇస్తున్న ప్రశాంత్ వర్మ తనకు ఏకంగా 1000 కోట్ల రూపాయల ఆఫర్ ఒకటి వచ్చిందని చెప్పుకొచ్చారు.
Rashmika Mandanna : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న రష్మిక మందన్న..
భారత ఇతిహాసాల మీద గనుక సినిమా చేయాలనుకుంటే ఆ సినిమాకి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినా పెట్టడానికి తాను రెడీ అని ఒక ఎన్నారై తనను సంప్రదించారని ఆయన వెల్లడించారు. అయితే ఆ ఆఫర్ స్వీకరించి ఇతిహాసాల మీద సినిమాలు చేస్తారా లేదా అనే విషయం మీద మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే తేజ సజ్జ అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్, గెటప్ శ్రీను, కమెడియన్ సత్య, రోహిణి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక జై హనుమాన్ సినిమా కోసం హనుమంతుడి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించాలని భావిస్తున్నామని ఆయన ఒప్పుకుంటే ఆయననే చిరంజీవిగా పెట్టి సినిమా చేస్తానని ప్రశాంత చెప్పుకొచ్చారు. శ్రీరాముడి పాత్ర కోసం మహేష్ బాబుని సంప్రదించే ఆలోచన కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.