రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సీజ్ ఫైర్ హిట్ అయిన జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సలార్ సక్సస్ పార్టీస్ జరుగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ది రాజా సాబ్, కల్కి 2898 AD సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాయి. ప్రభాస్ సినిమాల విషయం పక్కన పెడితే అయోధ్య టెంపుల్ కి ప్రభాస్ 50 కోట్లు ఇచ్చాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Janhvi Kapoor: మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్.. హీరో ఎవరంటే?
రామ్ మందిర్ ఓపెనింగ్ కి ప్రభాస్ ఇంత భారీ విరాళం ఇచ్చాడని నేషనల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో, వార్తల్లో వినిపిస్తున్న ఈ మాటలో నిజం లేదని సమాచారం. ప్రభాస్ టీమ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు రామ్ మందిర్ కి 50 కోట్లు విరాళం ఇవ్వలేదనే క్లారిటీ బయటకి వచ్చింది. జనవరి 22న జరగనున్న విగ్రహ ప్రతిష్టకి భారతదేశంలోని అంత్యంత ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. వీరిలో ప్రభాస్ కూడా ఉన్నాడు కాబట్టి జనవరి 22న అయోధ్యలో ఉండనున్నాడు.