ఈ సారి సమ్మర్ సోగాళ్ల సందడి మామూలుగా ఉండదని.. చెబుతున్నారు ఎఫ్ 3 మేకర్స్. ఇంతకు ముందు సినిమాల్లాగా టికెట్ రేట్లు పెంచడం లేదని.. సాధారణ టికెట్ ధరతోనే ఎఫ్ 3 రాబోతోందని.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ.. ఫుల్‌గా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై జనాల్లో హైప్ క్రియేట్ అవుతోంది. గత కొన్ని నెలలుగా యాక్షన్ సినిమాలు చూసిన ఆడియెన్స్.. ఈ సారి థియేటర్లో ఓ రెండు గంటల పాటు హాయిగా నవ్వేందుకు రెడీ అవుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఎఫ్ 3. ఇలాంటి టైంలో ఎఫ్ 3లో ఓ హీరోయిన్ హర్ట్ అయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎఫ్3 ప్రమోషన్స్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు.. హీరోయిన్లు కూడా సందడి చేస్తున్నారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా రాలేదు. అయితే ఆ టైంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్‌లో బిజీగా ఉంది కాబట్టి రాలేదని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా తమన్నా ఎఫ్3 ప్రమోషన్స్‌లో జాయిన్ కాలేదు. దాంతో తమన్నాకు ఎఫ్3 మేకర్స్ మధ్య ఏదో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే.. తమన్నా హర్ట్ అయిందనే టాక్ నడుస్తోంది. దానికి ఓ కారణం కూడా చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఎఫ్ 3లో తమన్నాతో పాటు మెహ్రీన్, సోనాల్ చౌహాన్ కూడా హీరోయిన్లుగా నటించారు. అయితే ఇందులో తమన్నా క్యారెక్టర్‌ని తగ్గించి.. సోనాల్ చౌహన్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే తమన్నా హర్ట్ అయిందని.. ఫలితంగా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటోందని అంటున్నారు. అయితే గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చినా.. ఇప్పుడు తమన్నా నిజంగానే అలిగిందా.. లేక ఇవన్నీ పుకార్లేనా అనేది తెలియాల్సి ఉంది.