Donga Naa Koduku: ’90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో మౌళీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే వినూత్న టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
“Beware… Donga Naa Koduku is here to steal a few laughs” అనే క్యాప్షన్‌తో మేకర్స్ తాజాగా అఫీషియల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది పూర్తి స్థాయి రాబరీ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ అని వెల్లడించింది. దొంగతనం నేపథ్యంలో సాగే కథకు కామెడీని జోడిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో మౌళీ సరసన సుష్మిత (సుష్షీ) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం దొంగ నా కొడుకు వహిస్తుండటం విశేషం. ఈ సినిమా ఆడియో హక్కులను థింక్ మ్యూజిక్ సొంతం చేసుకోగా, విదేశాల్లో ఈ చిత్రాన్ని ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేయనుంది. టైటిల్‌తోనే ఆసక్తి రేపిన ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

