Biggboss Sivaji: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు శివాజీ. ఇక హీరోగా ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యి రాజకీయాల్లో యాక్టివ్ గా మారాడు. కొన్ని పార్టీలకు ప్రచారకర్తగా మారి.. సంచలన వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా మారి.. బిగ్ బాస్ లో శివాజీ ది బాస్ గా మారాడు. ప్రస్తుతం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. ఇక చాలా గ్యాప్ తరువాత శివాజీ నటించిన సిరీస్ #90’s A Middle Class Biopic. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను రాజశేఖర్ మేడారం నిర్మించాడు. ఈటీవీ విన్ అనే ఓటిటీలో ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సిరీస్ టీజర్ ను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.
Dr.Priya: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి ప్రియ గుండెపోటుతో మృతి
ఇక ఈ చిత్రంలో శివాజీ సరసన వాసుకి నటించింది. తొలిప్రేమ సినిమాలో పవన్ చెల్లెలిగా నటించిన ఆమె ఈ మధ్యనే టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. 90 వ దశకంలో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. శివాజీ, వాసుకి భార్యాభర్తలు.. వారికి ముగ్గురు పిల్లలు. ఒక మధ్యతరగతి వ్యక్తి పిల్లలను చదివిస్తూ.. వచ్చిరానీ జీతంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తున్నాడు అనేది వినోదాత్మకంగా చూపించారు. ఇక శివాజీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరిగిపోయిన బనియన్ వేసుకొని.. అచ్చు గుద్దినట్లు మధ్యతరగతి తండ్రిలానే కనిపించాడు. మరి ఈ సిరీస్ తో శివాజీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.