ప్రస్తుతం ప్రేక్షకులు భాషా బేధం చూడడం లేదు.. సినిమా కంటెంట్ ను చూస్తున్నారు. నచ్చితే సినిమాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇటీవల కెజిఎఫ్ 2 చిత్రంతో అది మరోసారి రుజువు అయ్యింది. ఇంతకు ముందు కన్నడ సినిమాలను లెక్కే చేయని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలలో వెతికి మరి కన్నడ సినిమాలను చూస్తున్నారు. కెజిఎఫ్ తో యష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా టాలీవుడ్ లో అంతే ఫేమస్ అయ్యాడు. అదే ధైర్యంతో తన కొత్త చిత్రం ‘777 చార్లీ’ ను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. కిరణ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 10న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్‌ను వెంకటేష్, సాయి పల్లవి, లక్ష్మి మంచు విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం విశేషం.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తిండి, నిద్ర, పని తప్ప బంధం, బంధుత్వం లేని యువకుడు ధర్మ.. దీంతో అతడి జీవితం ఎవరికి నచ్చదు.. చివరికి ధర్మకు కూడా.. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి చార్లీ అనే కుక్క ఎంటర్ అవుతుంది. అప్పటినుంచి ధర్మ లైఫ్ మారిపోతోంది. చార్లీ తనపై చూపించే ప్రేమకు ముగ్దుడైన ధర్మ దానిపై ప్రేమ పెంచుకుంటాడు. అయితే ఒకానొక సమయంలో చార్లీని కొంతమంది మిలటరీ దళాలు తీసుకువెళ్లిపోతాయి. దింతో చార్లీ కోసం ధర్మ కాశ్మీర్ వెళ్లి పోరాటం చేస్తాడు..? మహిషికి, ఒక మూగ జీవానికి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది అనేది ఎంతో సున్నితంగా చూపించాడు దర్శకుడు.. ఇక చివరికి ధర్మ, తన చార్లీ ని కలుసుకున్నాడా..? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ధర్మ గా రక్షిత్ నటన హైలైట్ అని చెప్పాలి. ఇక చార్లీ గా నటించిన కుక్క ఎంతో అద్భుతంగా నటించింది. మరి నిర్మాతగా, హీరోగా రక్షిత్ శెట్టికి ‘777 చార్లీ’ ఎలాంటి గుర్తింపు తెస్తుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.
https://www.youtube.com/watch?v=DjNCn_B3fFg