Nandamuri Balakrishna : 50 ఏళ్లు హీరోగా.. ప్రపంచంలో ఏవరూ లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణకు కళా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రపతి ముర్ము చేతులు మీదుగా ఆ అవార్డు అందుకున్నారు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్న హిందూపురంలో ఆయన అభిమానులు భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటు పార్టీ శ్రేణులు ఇటు బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : MEGA 157 : మెగా – అనిల్ షూటింగ్ ఎప్పటినుండో తెలుసా.?
Also Read
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం. మీ అభిమానం, మీ ప్రేమ వెలకట్టలేనిది. ముఖ్యంగా హిందూపురం నియాజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాను. ఎమ్మెల్యే గా ఇక్కడి నుండి నన్ను మూడు సార్లు గెలిపించారు. నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే కావాలని ఎక్కడ లేదు. ఎంతో మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. నామరూప లేకుండా అడ్రస్ లేకుండాపోయారు. ముఖ్యంగా రామారావు కొడుకని నన్ను గెలిపించలేదు. హిందూపురంలో పనిచేశాను కాబట్టే నన్ను గెలిపించారు. మనం సమాజానికి ఎంత సేవ చేసామన్నది ముఖ్యం. అప్పుడే చరిత్రలో మనం నిలిచిపోతాం. నా కెరియర్లో 50 సంవత్సరాలుగా చిత్రపరిశ్రమలో లో హీరోగా ఉన్నాను. బహుశా ప్రపంచంలో ఇన్నేళ్లు హీరోగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అవకాశాలు తగ్గాకా క్యారెట్ ఆర్టిస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటారు. నన్ను ఇంత వాడిని చేసిన మీకు, తెలుగు జాతికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ నన్ను చూసి చాలామంది పొగరు ఎక్కువ అని అంటారు. నన్ను ఉసిగొలిపే ప్రతి దానికి నేను ముక్కు సూటిగా మాట్లాడుతాను.నా నిజాయితీ నిబంధన మానవత్వం, నా వ్యక్తిత్వం ఉన్నందునే ముందు ముందు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!