వన్స్ ఆపాన్ ఎ టైంలో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు కనిపించేవి. కానీ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునలకు మాత్రం సాధ్యం కాలేదు. త్రిమూర్తులు సినిమాలో ఓ సాంగ్‌లో స్టార్స్ అలా మెరిశారంతే. ఆ తర్వాత తరం కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. అప్పుడప్పుడు అడపాదడపా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి కానీ అవి చాలవంటున్నారు ఫ్యాన్స్. నాట్ ఓన్లీ టాలీవుడ్ సౌత్ మొత్తం అలానే ఉంది. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్‌కు ఫీస్ట్ రెడీ చేస్తున్నాయి టాలీవుడ్ అండ్ కోలీవుడ్, మాలీవుడ్స్.
టాలీవుడ్ : మన శంకర్ వరప్రసాద్ గారూతో ఫ్యాన్స్ కోరుకుంటున్న కాంబినేషన్ రెడీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. చిరంజీవి- వెంకటేశ్ కలిసి నటించబోతున్నారు. చిరు వస్తుంటేనే తట్టుకోవడం కష్టం. దీనికి వెంకటేశ్ కూడా తోడైతే మజానే వెరు. అలాగే బాలయ్య- వెంకీ కాంబోలో కూడా మూవీ ప్లాన్ చేస్తున్నారన్నది టాక్.
కోలీవుడ్ : కోట్లాది మంది కోలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్న కాంబో రజనీకాంత్ అండ్ కమల్ హాసన్. ఈ మధ్యే మేమిద్దరం కలిసి నటించబోతున్నామంటూ కమల్ హాసన్ చెబితే.. రజనీ కూడా సై అన్నాడు. 46 సంవత్సరాల తర్వాత ఈ రేర్ కలయిక కలవబోతుంది.
మలయాళం : కేరళ స్టార్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు మరోసారి నటించబోతున్నారు. 2008లో వచ్చిన ట్వంటీలో కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అంటే 16 ఏళ్ల తర్వాత ఈ జోడీని కలిపాడు డైరెక్టర్ మహేష్ నారాయణన్. వీరితో పాటు ఫహాద్ ఫజిల్, కుంచికోబొబన్, నయనతార లాంటి స్టార్ట్ కాస్ట్‌ను జోడించాడు. ఎంఎంఎంఎన్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న ఈ సినిమాకు పాట్రియాట్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. లాస్ట్ ఇయరే స్టార్టైన ఈ ఫిల్మ్ నెక్ట్స్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా సౌత్ త్రీ ఇండస్ట్రీ మెయిన్ పిల్లర్స్ కలిసి నటించబోతుంటే ఫ్యాన్స్‌కు ఫీస్ట్ కాకపోతే మరేమిటీ..?