Site icon NTV Telugu

సౌత్ సినిమాలా మజాకా… 25 మూవీస్ రీమేక్

tollywood

ఈ మధ్య బాలీవుడ్‌లో సౌత్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందుకే అనేక సౌత్ ఇండియన్ సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. మరికొన్ని సౌత్ సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 25 సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్‌లు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ రీమేక్ ప్రాజెక్ట్‌లలో ఎక్కువగా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలే ఉండడం విశేషం. అల వైకుంఠపురములో, జెర్సీ, హిట్, నాంది, ఛత్రపతి వంటి తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి.

Read Also : లైవ్‌ ది లిటిల్‌ థింగ్స్… సోదరితో చెర్రీ పిక్స్ వైరల్

కైతి, జిగర్తాండ, అన్నీయన్, విక్రమ్ వేధ, ధ్రువంగళ్ పతినరు, రాట్చసన్, తడం, కోమలి, మానగరం, అరువి, మానాడు, సూరరై పొట్రు, మాస్టర్ వంటి తమిళ చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్, దృశ్యం 2, హెలెన్, అయ్యప్పనుమ్ కోషియుమ్, నాయట్టు వంటి మలయాళ చిత్రాలు బాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నింటినీ రీమేక్‌ చేసే పనిలో ఉన్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి యూటర్న్ హిందీ చిత్ర పరిశ్రమను ఆకట్టుకుంది. ఈ సినిమాలే కాకుండా ఇంకా చాలా సౌత్ సినిమాలను అక్కడ రీమేక్‌ చేయడానికి చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ సినిమాను ప్రాంతీయ కంటెంట్ శాసిస్తున్నదని ఇది రుజువు చేస్తోంది.

Exit mobile version