‘కృష్ణరావు సూపర్ మార్కెట్’ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు గౌతంరాజు తనయుడు కృష్ణ. శుక్రవారం అతని పుట్టిన రోజును పురస్కరించుకుని తాజాచిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ప్రస్తుతం కృష్ణ ‘2+4=24’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆర్. పి. రామ్ దర్శకత్వంలో నంబిరాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. శుక్రవారం హీరో కృష్ణ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.