డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘1997’. డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు డాక్టర్ మోహన్ చెబుతున్నారు. ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ముగ్గురు ప్రధాన పాత్రధారుల లుక్స్ పోస్టర్స్ ను కూడా విడుదల చేశాం. అలాగే ఈ మూవీ లోని వన్ అండ్ ఓన్లీ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’ రిలికల్ వీడియోను రిలీజ్ చేశాం. దానికి మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మా చిత్రం ‘1997’ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయబోతున్నాం” అని అన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాకు చక్కని సంగీతాన్ని సమకూర్చడంతో పాటు ఓ కీలక పాత్ర పోషించారని నిర్మాత మీనాక్షి రమావత్ తెలిపారు.