Site icon NTV Telugu

చిత్తూరులో మూతపడ్డ 17 థియేటర్లు

Theatres

ఏపీలో టికెట్ రేట్ల విషయంపై వివాదం కొనసాగుతోంది. డిస్ట్రిబ్యూటర్ల ఆవేదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని పట్టుబట్టింది. దీంతో ఇప్పటికే పలువురు థియేటర్ యాజమాన్యాలు నష్టాల్లో సినిమాలను ప్రదర్శించలేక స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసేసుకున్నారు. మరోవైపు థియేటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ తనిఖీల్లో చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూత పడ్డట్లు సమాచారం. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరులలో నిన్న మధ్యాహ్నం నుంచే షో లు రద్దు అయ్యాయి. జిల్లాలో మొత్తం 70 థియేటర్ల లైసెన్సులు పునరుద్ధరణ కాలేదని అధికారులు గుర్తించినట్టు సమాచారం. 37 సినిమా థియేటర్ల మూసివేతకు నిన్ననే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

https://ntvtelugu.com/siddharth-sensational-comments-on-ap-tcket-rates-issue/

మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోట 3, బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4, పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్ల పల్లిలలో థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. థియేటర్ల అధినేతలు, ఎగ్జిబిటర్ లతో నిన్న సమావేశమైన జిల్లా జాయింట్ కలెక్టర్ రాజా బాబు లైసెన్స్ రెన్యువల్ లేకుండా షోలకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. అయితే సోమవారం వరకు థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు అనుమతి కోరినట్టు తెలుస్తోంది. కానీ లైసెన్స్ రెన్యువల్ లేని థియేటర్లలో నేడు షోలు పడతాయా ? లేదా అన్నది అనుమానమే !

Exit mobile version