సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో కొత్త కుర్రాడు అమిత్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ సినిమాకి 1000 వాలా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టెన్ రూపీస్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన అఫ్జల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ మధ్యన విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో అందరినీ ఆకట్టుకుంది.
NTR : తాత జయంతి..ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..
సోషల్ మీడియా లో వచ్చిన స్పందన చూసి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “మా 1000 వాలా చిత్రం ఫస్ట్ లుక్ సోషల్ మీడియా ప్రేక్షకులను ఆకట్టుకుంది, లైక్స్ అలాగే కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అని నమ్మకం కలిగింది అన్నారు. షూటింగ్ అంతా పూర్తి అయింది, ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు. ఇక ఈ సినిమాకి కథనం, మాటలు : గౌస్ ఖాజా అందించగా కెమెరా : చందు ఏజె, డాన్స్ : బాలు మాస్టర్, సూర్య కొలుసు, ఫైట్స్ : డైనమిక్ మధు కంపోజ్ చేశారు. వంశీకాంత్ రేఖాన సంగీతం అందించిన ఈ సినిమాకు నిర్మాతగా షారుఖ్, డైరెక్టర్ గా అఫ్జల్ వ్యవహరిస్తున్నారు.