విలువలు వీడని కె.బి.తిలక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జనవరి 14న దర్శకనిర్మాత కె.బి.తిలక్ జయంతి)
విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది.
కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే తిలక్. వీరి అక్కనే మళ్ళీ ఎల్వీ ప్రసాద్ వివాహమాడారు. అలా ఎల్వీ ప్రసాద్, తిలక్ కు మేనమామ, బావ కూడా అవుతారు. ప్రసాద్ స్ఫూర్తితోనే తిలక్ చిత్రసీమలో అడుగు పెట్టారు. అంతకు ముందు అభ్యుదయ భావాలతో తిరిగేవారు. ప్రజానాట్యమండలిలో చురుగ్గా పాల్గొనేవారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలలోనూ ఉత్సాహంగా పాల్గొని సాగేవారు. ఎల్.వి.ప్రసాద్ వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తిలక్, 1956లో ‘ముద్దుబిడ్డ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జగ్గయ్య, జమున నటించిన ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. అప్పటికే యన్టీఆర్, ఏయన్నార్ టాప్ హీరోస్ గా సాగుతున్నందున్న తిలక్, తన మిత్రుడు జగ్గయ్యతోనే సినిమాలు తీస్తూ ఆయననూ ఓ ప్రముఖ కథానాయకునిగా నిలిపారు. జగ్గయ్య, సావిత్రితో తరువాత తిలక్ తీసిన ‘ఎమ్.ఎల్.ఏ.’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రాన్ని తమిళంలోనూ ‘మామియరుమ్ ఒరు వీట్టు మరుమగలే’ రూపొందించి, రెండు చోట్లా ఆదరణ సంపాదించారు. జగ్గయ్య హీరోగా, ఆరుద్ర రచన, పెండ్యాల సంగీతంతో సాగారు తిలక్. “ఈడు-జోడు, ఉయ్యాల-జంపాల, పంతాలు – పట్టింపులు” వంటి చిత్రాలు తెరకెక్కించారు. “ఛోటీ బహు, కంగన్” వంటి హిందీ చిత్రాలనూ రూపొందించారు.
Also Read
తిలక్ రూపొందించిన ‘భూమికోసం’ చిత్రంతోనే జయప్రద పరిచయమయ్యారు. కృష్ణ, ప్రభ జంటగా తిలక్ తెరకెక్కించిన ‘కొల్లేటి కాపురం’ కూడా అలరించింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘ధర్మవడ్డీ’. సినిమా రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నిటా పెరిగిపోయిన వేగం ఆయనకు నచ్చలేదు. దాంతో 1982 తరువాత నుంచీ సినిమాలకు దూరంగా ఉన్నారాయన. 2008లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తిలక్ ను బి.యన్.రెడ్డి జాతీయ అవార్డుతో గౌరవించింది. 2010 సెప్టెంబర్ 23న తిలక్ కన్నుమూశారు. ఈ నాటికీ తిలక్ చిత్రాల్లోని కథావస్తువును, సంగీతసాహిత్యాలను అప్పటి సినీ ఫ్యాన్స్ నెమరువేసుకుంటూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!