దూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా చాలా మంది బానిసలుగా మారుతున్నారు.. సరదాగా కాల్చిన ఒక్కటే ఇప్పుడు వ్యసనంలా మారుతున్నాయి.. మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని సమాచారం.. పొగలో హానీకరమైన పదార్థాలు ఉండటంతో ఊపిరితిత్తులు నుంచి గుండె వరకు అనేక సమస్యల బారిన పడటంతో పాటు క్యాన్సర్ కు కూడా రావడంతో ప్రాణాలను కోల్పోతున్నారు..
అంతేకాదు..స్మోకింగ్ వల్ల దంతవ్యాధులు, క్షయ వ్యాధి, , అల్సర్ , గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. పొగాకులో ఆర్సెనిక్, బెంజీన్, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, ఇథిలీన్ ఆక్సైడ్ వంటి 72 రకాల క్యాన్సర్ కారకాలుంటాయి.. ఇవన్నీ కూడా మనిషి ప్రాణాలను హరించి వేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.. మే 31న పొగాకు వ్యతిరేక దినంను నిర్వహిస్తున్నారు.. పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజలకు, ప్రజారోగ్యానికి, సమాజానికి, పర్యావరణానికి కలిగే హాని గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 31న పొగాకు వ్యతిరేక దినం నిర్వహిస్తారు..
ఈ స్మోకింగ్ ఒకసారి అలవాటు అయితే మానెయ్యడం చాలా కష్టం..ఈ అలవాటును వదిలించుకోవడానికి కొన్ని టిప్స్ ను ఇక్కడ తెలుసుకుందాం..
*. ఆరోగ్యకరమైన చిరు తిండిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి..
*. నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్లు తినడం, వాటి జ్యూస్ తాగినా సిగరెట్ తాగాలనే కోరికను చంపేయవచ్చు.
*. చూయింగ్ గమ్ ను నమలడం కూడా మంచిదే..
*.చాక్లేట్స్ తినడం కూడా అలవాటు చేసుకోండి.. అది కూడా లిమిట్ గానే.. ఇవన్నీ తప్పక ఫాలో అయితే స్మోకింగ్ నుంచి బయటపడవచ్చనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..