NTV Telugu Site icon

World Heart Day 2024 : యువతలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయ్?

Heart Attack

Heart Attack

ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ప్రతి యువకుడి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్నగా మారుతోంది. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల గుండెపోటు కేసులు యువతలో తరచుగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

READ MORE: Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?

గుండెనొప్పి రావడానికి ప్రధాన కారణాలు మనందరికీ తెలిసినవే. పెద్దవారిలోనైనా, యువతలో అయినా.. ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై నియంత్రణ లేకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్ల వల్ల గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కలిసి మొదట్లో బరువు పెరగడానికి కారణం అవుతాయట. ఆపై మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యల్ని తెచ్చిపెట్టి చివరికది గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని తెచ్చిపెట్టే కరోనరి ఆటరీ డిసీస్‌కు దారి తీస్తాయట. ఒకవేళ యుక్త వయసులో గుండెపోటు వస్తే తొందరగా గుర్తించలేమట. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా విరుచుకు పడి ప్రాణాంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే యుక్త వయస్కులు అందరూ కూడా 25 ఏళ్లు దాటాకా గుండె ఆరోగ్యాన్ని తెలిపే కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం.

READ MORE:Mallikarjun Kharge: క్షీణించిన మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం.. వేదికపై ప్రసంగిస్తూ..

వయసు పైబడిన వారితో పోలిస్తే చిన్న వయసులో వచ్చే గుండెపోటు చాలా ప్రమాదం. ప్రాణాంతకమైంది కూడానూ. ఇందుకు కారణం ఉంది. పెద్ద వయసులో గుండెపోటు ఒక్కసారిగా రాదు. రక్తనాళాల్లో అడ్డంకులు అనేవి క్రమంగా పెరుగుతూ వస్తాయి. ఇలాంటప్పుడు బ్లాక్‌ అవుతున్న రక్తనాళాలకు పక్కనే కొల్లేటరల్స్‌ అనే చిన్న చిన్న రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దీంతో ప్రధాన రక్తనాళంలో అడ్డంకి మూలంగా రక్తప్రసారం ఆగిపోయినా పక్కనే ఉండే కొల్లేటరల్స్‌ రక్తనాళాల సాయంతో గుండెకు కొంచెమైనా రక్తం అందుతుంది. యువతలో ఇలాంటి పరిస్థితి కనిపించదు. కొల్లేటరల్‌ రక్తనాళాలు ఏర్పడకపోవడంతో గుండెపోటు వచ్చినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంటుంది. సమతుల ఆహారం తీసుకోవడం, నిత్యం కనీసం ఒక గంటపాటు వ్యాయామం చేయటం, ఆందోళన, ఒత్తిళ్లను తగ్గించుకునే విధంగా యోగా, ధ్యానం, పుస్తక పఠనం లాంటి కొన్ని మంచి వ్యాపకాలను ఆశ్రయించడం ద్వారా గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేట్లు జాగ్రత్త పడొచ్చు.