White vs Brown Rice: బరువు తగ్గడానికి చాలా మంది తెల్ల బియ్యం వదులుగా బ్రౌన్ రైస్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. వైట్ రైస్ బరువు పెరగడానికి, షుగర్ స్పైక్స్ రావడానికి కారణంగా చెబుతుంటారు. దీంతో చాలా మంది దీనికి బదులుగా బ్రౌన్ రైస్ తింటుంటారు. అయితే, నిజంగా బరువు తగ్గడానికి ఏ వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్‌లో ఏది ముఖ్యమో తెలుసుకుందాం.
బ్రౌన్ రైస్, వైట్ రైస్ మధ్య తేడా ఏమిటి.?
వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ బయటి పొర(ఊక)ను కలిగి ఉంటుంది. దీంతో బ్రౌన్ రైస్ అధిక ఫైబర్, విటమిన్లు ఉంటాయి. దీనికి విరుద్ధంగా వైట్ రైస్‌ను చాలా ఎక్కువ ప్రాసెస్ చేసి వైట్‌గా మారస్తారు. ఇది బియ్యాన్ని మృదువుగా, మన్నికైనదిగా చేస్తుంది. కానీ వైట్ రైస్‌లో ఫైబర్, పోషకాలు చాలా తగ్గుతాయి.
క్యాలరీలు ఎందులో అధికం..?
క్యాలరీల విషయాని వస్తే ప్రజలు బ్రౌన్ రైస్‌లో తక్కువ క్యాలరీలు ఉన్నట్లు భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు. బ్రౌన్ రైస్, వైట్ రైస్ దాదాపుగా సమాన క్యాలరీలను కలిగి ఉంటాయి. రెండింటికి ప్రధానమైన తేడా బ్రౌన్ రైస్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ మాత్రమే. ఇది కడుపు నిండిన ఫీలింగ్ ఇవ్వడంతో పాటు, ఎక్కువ సేపు ఆకలి కాకుండా తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి ఏది ముఖ్యం..?
బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి ప్రధానంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపులో ఎక్కువ సేపు జీర్ణమయ్యేలా చేస్తుంది. వైట్‌రైస్‌తో పోలిస్తే చాలా ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల తినాలనే కోరిక తగ్గుతుంది. తద్వారా మనం అధికం తినకపోవడం, వెంట వెంటనే తినకపోవడం చేస్తుంటాం.
ఇక బ్రౌన్ రైస్ షుగర్ హెచ్చుతగ్గుల్ని ప్రభావితం చేస్తుంది. దీనిని తిన్న వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలై, నెమ్మదిగా తగ్గుతుంది. వైట్ రైస్‌లో మాత్రం షుగర్ వేగంగా ఒంట్లోకి వచ్చి వేగంగా తగ్గుతుంది. దీని వల్ల ప్రాక్రియాసిస్, ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. షుగర్ ఉన్న వారికి బ్రౌన్ రైస్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలం బ్రౌన్ రైస్ తినడం వల్లే బరువు తగ్గరు. దీనికి వ్యాయామం, మిగత ఆహార అలవాట్లు చాలా కీలకం.
తెల్లబియ్యం చెడ్డవా..?
వైట్ రైస్ అనారోగ్యానికి కారణమవుతుందా.? అంటే లేదనే చెప్పాలి. వైట్ రైస్ తేలికగా జీర్ణమవుతుంది. శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని ఇస్తుంది. ఆసియా దేశాల్లో ఎన్నో ఏళ్లుగా వైట్ రైస్ తింటున్నారు. చాలా మంది ఫిట్‌గా ఉంటారు. తిన్న ఆహారానికి సమానంగా జీవన శైలి ఉండటంతో వారు రోగాల బారిన పడటం లేదు. ఇక వైట్ రైస్‌తో పాటు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్లు సరిపాళ్లలో తీసుకుంటే వైట్ రైస్ వల్ల పెద్ద ప్రమాదం ఉండదు.
బరువు తగ్గాలంటే బ్రౌన్ రైస్ ముఖ్యం..
త్వరగా బరువు తగ్గాలంటే వైట్ రైస్‌తో పోల్చితే బ్రౌన్ రైస్ తినడమే బెటర్. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది. తెల్లబియ్యాన్ని మితంగా తీసుకుంటే ప్రమాదం లేదు. దీనికి తోడు ప్రోటీన్లు, వ్యాయామం చాలా అవసరం.
