NTV Telugu Site icon

Weight Loss Tips: రాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే బరువు పెరగడం ఖాయం!

Weight Gain

Weight Gain

Weight Loss Diet for Night: ప్రస్తుత రోజుల్లో మారిన జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దేశ జనాభాలో 5 శాతంకు పైగా ఊబకాయంతో బాధపడుతుంటే.. మరెందరో అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు.. కానీ ఇది ఖచ్చితంగా అనేక సమస్యలకు దారితీస్తుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధలకు కారకం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు బరువు తగ్గిస్తే చాలా మంచిది.

బరువు తగ్గడానికి కఠినమైన ఆహారం మరియు భారీ వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది. మరొకొందరు ఇంకా ఎన్నో పద్దతులను ఫాలో అవుతుంటారు. అయినా కూడా ఫలితం ఉండదు. ఐతే మన స్వంత తప్పిదాల వల్ల కూడా ఆకస్మికంగా బరువు పెరగడం మొదలవుతుంది. స్థూలకాయం రాకుండా ఉండాలంటే.. రాత్రి పూట కొన్ని తప్పులు అస్సలు (Weight Loss Mistakes At Night) చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అతిగా విందు చేయవద్దు:
కొంతమందికి రాత్రిపూట అతిగా తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటే మీలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. కొందరికి తరచుగా పగటిపూట ఎక్కువగా తినడానికి సమయం దొరకదు. అందుకే రాత్రిపూట తింటారు. అలా బరువు పెరుగుతారు. రాత్రిపూట అతిగా విందు చేయవద్దు.

Also Read:
Pat Cummins Yorker: ప్యాట్‌ కమ్మిన్స్‌ సూపర్‌ యార్కర్‌.. ఇంగ్లండ్ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్
శీతల పానీయాలకు దూరంగా ఉండాలి:
సాధారణంగా మనం పెళ్లిళ్లలో, పార్టీలలో లేదా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు రాత్రి భోజనం చేసిన తర్వాత శీతల పానీయాలు పుచ్చుకుంటాం. శీతల పానీయాలను నిద్రపోయే ముందు తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అనవసరంగా నడుము మరియు పొట్ట వద్ద కొవ్వు పెరుగుతుంది.

రాత్రిపూట మద్యపానం వద్దు:
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. అయినప్పటికీ కొంతమంది ఈ చెడు వ్యసనానికి బానిసగా మారుతారు. ఇప్పుడు లేట్ నైట్ పార్టీలలో ఆల్కహాల్ తాగే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఇలా చేయడం వల్ల బాడీ మెటబాలిజం రేట్ తగ్గి బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత త్వరగా ఈ అలవాటును మానుకోవడం మంచిది.

Also Read: Budget Cars in India 2023: 5 లక్షల కంటే తక్కువ ధర.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే మూడు కార్లు ఇవే!