Pat Cummins Yorker: ప్యాట్ కమ్మిన్స్ సూపర్ యార్కర్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins Bolds Ollie Pope with Stuning Yorker in Ashes 2023 1st Test: ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేస్, బౌన్స్, స్వింగ్, యార్కర్‌లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతాడు. ఇక పేస్ పిచ్ అయితే అతడు మరింత చెలరేగుతాడు. యార్కర్‌లతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. మేటి బ్యాటర్ కూడా కమ్మిన్స్ బౌలింగ్ ముందు తేలిపోతాడు. కమ్మిన్స్ పేస్ పిచ్‌పై తానెంత ప్రమాదకారో మరోసారి చూపెట్టాడు. ఓ సూపర్ యార్కర్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్ చేశాడు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యాషెస్ 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సూపర్ బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను అడ్డుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లీష్ మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్‌ను ఓ సూపర్ యార్కర్‌తో బోల్తా కొట్టించాడు. 17వ ఓవర్లోని చివరి బంతిని 139 కిమీ వేగంతో కమ్మిన్స్ యార్కర్ వేయగా.. పోప్ వద్ద సమాధానమే లేదు. అతడు బ్యాట్ అడ్డుపెట్టేలోపే బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో పోప్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది.
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
Also Read:
Suraj Randiv Bus Driver: ఎంఎస్ ధోనీతో ఆడాడు.. ప్రపంచకప్ జట్టులో సభ్యుడు! ఇప్పుడు మాత్రం బస్ డ్రైవర్
ప్యాట్ కమ్మిన్స్ యార్కర్‌కు బలైన ఓలీ పోప్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అతడు 14 పరుగులు నిరాశపరిచాడు. కమ్మిన్స్ యార్కర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. చివరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది. దాంతో ఫాన్స్ అందరూ చివరి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
A superb yorker from Pat Cummins to clean up Ollie Pope 💥#Ashes | #WTC25 | 📝: https://t.co/ZNnKIn9jeq pic.twitter.com/de8FBZZnHw
— ICC (@ICC) June 19, 2023
https://twitter.com/ZohaibKashiff/status/1670770822829465600
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!