ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది.. బరువును తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి న్యాచురల్ టిప్స్ అంటూ ఇంట్లో దొరికే వాటిని ట్రై చేస్తారు.. అధిక బరువును సులువుగా తగ్గెందుకు అదిరిపోయే చిట్కా ఇది.. ఆ అద్భుతమైన డ్రింక్.. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ డ్రింక్ కోసం మిరియాలు,అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిటికెడు పసుపు, గుప్పెడు పుదీనా ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని పక్కన పెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక దంచి ఉంచుకున్న మిశ్రమాన్ని దానిలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి.. ఆ తర్వాత గోరు వెచ్చగా అయ్యేవరకు ఉంచాలి.. ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి..
ఈ డ్రింక్లో టేస్ట్ కోసం కొద్దిగా తేనె కలుపుకొని తాగవచ్చు.. ఈ డ్రింక్ ను వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ డ్రింక్ ని ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో, రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దాల్చిన చెక్క రక్తప్రసరణను మెరుగుపరచటంలో సహాయపడుతుంది. మిరియాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.. ఇక వెల్లుల్లి, పసుపులు కొవ్వు కణాలను విచ్చిన్నం చేసి కరిగించటానికి సహాయపడుతుంది… బరువు తగ్గుతున్నాం కదా అని ఎక్కువగా తాగడం మంచిది కాదు.. ఇది గుర్తుంచుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.