Weight Gain: మహిళలు సడెన్‌గా బరువు పెరగడానికి కారణాలు ఇవే..
- ఆకస్మికంగా బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణం కాదు
- చాలా కారణాలు ఉంటాయ్
- అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకస్మికంగా బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణం కాదు. చాలా కారణాలు ఉండే ఉంటాయి. వాటిలో అంతర్లీనంగా ఉండే వ్యాధులు కూడా ఉన్నాయి. అయితే కొంత మంది మహిళలు సడెన్‌గా బరువు పెరుగుతుంటారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.. బరువు పెరుగుదలకు మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. వీటివల్ల హర్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆకలి ఎక్కువగా వేస్తుందని.. ఫలితంగా ఆహారం ఎక్కువగా తీసుకుంటామన్నారు. దీంతో బరువు పెరుగుతామని, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువని అంటున్నారు.
పీసీఓఎస్, మెనోపాజ్
హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వేధిస్తుంది. పీసీఓడీ, పీసీఓఎస్ సమస్య ఉన్నవారిలో కూడా బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మెనోపాజ్ దశ వచ్చిన సమయంలోనూ బరువు పెరిగే అవకాశం ఉంటుందట. హార్మోన్స్ తగ్గడం వల్ల జీవక్రియ నెమ్మదించి బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరొకటి సమస్య మహిళల్లో ఎక్కువగా థైరాయిడ్ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ జీవ క్రియను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ శరీరానికి అవసరమైన మోతాదు కంటే తక్కువగా విడుదలవ్వడం వల్ల జీవక్రియలు తగ్గడంతో పాటు బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
కుషింగ్స్ సిండ్రోమ్.. నిద్రలేమి
కుషింగ్స్ సిండ్రోమ్ కూడా అధిక బరువు పెరుగుదలకు కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలపై ఉండే అడ్రినల్ గ్రంధులు కార్టిసైల్ అనే హర్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. ఇది మన దేశంలో తక్కువగా ఉన్నప్పటికీ.. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు. బరువు పెరగడానికి కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటని అంటున్నారు. రాత్రుళ్లు ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోతుందట. నిద్ర లేకపోవడం వల్ల శరీరం కార్టిసైల్, ఇన్సులిన్ హర్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తుందని.. ఇది బరువు పెరిగేలా చేస్తుందని వివరించారు. ఆకలిని కలిగించే హార్మోన్లు సైతం గందరగోళానికి గురై అధిక ఆహారం తీసుకునేలా చేస్తాయట.
తాజావార్తలు
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!