NTV Telugu Site icon

Weight Gain: మహిళలు సడెన్‌గా బరువు పెరగడానికి కారణాలు ఇవే..

Women Gain Weight

Women Gain Weight

ఆకస్మికంగా బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణం కాదు. చాలా కారణాలు ఉండే ఉంటాయి. వాటిలో అంతర్లీనంగా ఉండే వ్యాధులు కూడా ఉన్నాయి. అయితే కొంత మంది మహిళలు సడెన్‌గా బరువు పెరుగుతుంటారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.. బరువు పెరుగుదలకు మానసిక ఒత్తిడి, డిప్రెషన్​ కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. వీటివల్ల హర్మోన్​లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆకలి ఎక్కువగా వేస్తుందని.. ఫలితంగా ఆహారం ఎక్కువగా తీసుకుంటామన్నారు. దీంతో బరువు పెరుగుతామని, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువని అంటున్నారు.

పీసీఓఎస్​, మెనోపాజ్​
హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌) వేధిస్తుంది. పీసీఓడీ, పీసీఓఎస్ సమస్య ఉన్నవారిలో కూడా బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మెనోపాజ్ దశ వచ్చిన సమయంలోనూ బరువు పెరిగే అవకాశం ఉంటుందట. హార్మోన్స్ తగ్గడం వల్ల జీవక్రియ నెమ్మదించి బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరొకటి సమస్య  మహిళల్లో ఎక్కువగా థైరాయిడ్​ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్​ జీవ క్రియను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ శరీరానికి అవసరమైన మోతాదు కంటే​ తక్కువగా విడుదలవ్వడం వల్ల జీవక్రియలు తగ్గడంతో పాటు బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

కుషింగ్స్ సిండ్రోమ్.. నిద్రలేమి
కుషింగ్స్ సిండ్రోమ్ కూడా అధిక బరువు పెరుగుదలకు కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలపై ఉండే అడ్రినల్​ గ్రంధులు కార్టిసైల్ అనే హర్మోన్​ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. ఇది మన దేశంలో తక్కువగా ఉన్నప్పటికీ.. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు. బరువు పెరగడానికి కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటని అంటున్నారు. రాత్రుళ్లు ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోతుందట. నిద్ర లేకపోవడం వల్ల శరీరం కార్టిసైల్, ఇన్సులిన్ హర్మోన్​లను అధికంగా ఉత్పత్తి చేస్తుందని.. ఇది బరువు పెరిగేలా చేస్తుందని వివరించారు. ఆకలిని కలిగించే హార్మోన్​లు సైతం గందరగోళానికి గురై అధిక ఆహారం తీసుకునేలా చేస్తాయట.