Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
- వాస్తు ప్రకారం ఈ 5 వస్తువులు ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదు.
- పగిలిన అద్ధం, పాడైన గడియారంతో ఇంట్లో ప్రతికూల ప్రభావం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vastu Tips: ఇంట్లో ఉండే వస్తువుడు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ప్రభావాన్ని చూపిస్తాయి. సాధారణ వస్తువులు ఆ ఇంట్లో నివసించే వారిపై సానుకూల, ప్రతికూలంగా పనిచేయగలవు. పలిగిలిన అద్ధం, ఆగిపోయిన గడియారం, ఎండిపోయిన మొక్కలు, పాతబడిన చెప్పులు-బూట్లు, చెత్త కుప్పలు కూడా వాస్తు దోషాలకు కారణం అవుతాయి. ఇంట్లో మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతాయి.
1) పగిలిన అద్దం:
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
మన పూర్వీకుల కాలం నుంచి ఇంట్లో పగిలిన అద్దం ఉండటాన్ని అరిష్టంగా భావిస్తారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దని చెబుతుంటారు. దీని వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని చెబుతున్నారు.
2) సరిగా పనిచేయని గడియారం:
గడియారం కేవలం సమయాన్ని చెప్పే ఒక సాధనం మాత్రమే కాదు, ఇది జీవిత గమనాన్ని, పురోగతిని సూచించే ఒక చిహ్నం. వాస్తు విశ్వాసాల ప్రకారం, ఇంట్లో విరిగిన లేదా ఆగిపోయిన గడియారాన్ని ఉంచడం మంచిది కాదు. ఇలాంటి గడియారం ఉంటే దానిని వెంటనే బాగు చేయించడం మంచిది.
3) పాత లేదా చిరిగిన బూట్లు-చెప్పులు:
పాత, చిరిగిన లేదా ఉపయోగించలేని బూట్లు, చెప్పులను ఇంటి మూలలో చాలా కాలం పాటు పడేసి ఉంచడం కూడా వాస్తు ప్రకారం అశుభకరమైనవిగా భావిస్తారు. అటువంటి వస్తువులు ప్రతికూలతను పెంచుతాయని, ఆర్థిక సమస్యలను కలిగిస్తాయని నమ్ముతారు. అందువల్ల, ఉపయోగించని బూట్లను సకాలంలో ఇంటి నుండి తీసివేయడం బెటర్.
4) మూత లేని, మురికి చెత్తబుట్టలు:
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పరిశుభ్రత ఇంటి వాతావారణాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇంట్లో మురికి లేదా మూత లేని చెత్తబుట్ట ప్రతికూల శక్తుల్ని ఆహ్వానిస్తుందని నమ్ముతారు. చెత్తబుట్టను ఎల్లప్పుడూ మూసి ఉంచాలి. క్రమం తప్పకుండా ఇంట్లో చెత్తను బయట పారేశాయాలి. ప్రత్యేకంగా వంటగది లేదా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడదు.
5) ఎండిపోయిన, వాడిపోయిన చెట్లు:
పచ్చని చెట్లు ఇంట్లో లేదా ఇంటి ముందర ఉంటే ఇవి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఒక వేళ మొక్కలు ఎండిపోతే అశుభంగా భావిస్తారు. వాస్తు నమ్మకాల ప్రకారం, వాడిపోయిన లేదా ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఆర్థిక, మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయని నమ్ముతారు. మొక్కలు ఎల్లవేళల ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..