Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో రోజూ ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. అయితే మార్కెట్ నుంచి తాజాగా కొనుగోలు చేసిన మిరపకాయలు ఫ్రిజ్‌లో పెట్టిన రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం లేదా కుళ్లిపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. దీనికి ప్రధాన కారణం వాతావరణం మాత్రమే కాదు, వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం కూడా.. అసలు, పచ్చిమిరపకాయలు త్వరగా పాడవడానికి ప్రధాన కారణం తేమ. మిరపకాయలపై నీరు ఉండటం లేదా తడిగా ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల బూజు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఫలితంగా అవి మెత్తబడటం, రంగు మారడం, కుళ్లిపోవడం జరుగుతుంది. అందుకే నిల్వ చేసే ముందు అవి పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఎక్కువాలం తాజాగా ఉండాలంటే..?
మిరపకాయలను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే ముందుగా వాటిలో మెత్తబడినవి, మచ్చలు ఉన్నవి లేదా పాడైపోయినవిని వేరు చేయాలి. అనంతరం అన్ని మిరపకాయల కాడలను తొలగించాలి. తర్వాత శుభ్రమైన, పొడి, గాలి చొరబడని డబ్బా తీసుకుని అడుగున టిష్యూ పేపర్ లేదా పేపర్ టవల్ పరచాలి. దానిపై మిరపకాయలను వేసి, మళ్లీ మరో టిష్యూ పేపర్‌తో కప్పి మూత పెట్టాలి. టిష్యూ పేపర్ అదనపు తేమను పీల్చుకోవడంతో మిరపకాయలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. టిష్యూ పేపర్ తడిగా మారితే వెంటనే మార్చడం మంచిది.
Also Read
- Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- Steel Taps cleaning Tips: స్టీల్ ట్యాప్‌లు కొత్తవిలా మెరవాలంటే.. ఈ చిట్కా తప్పక ట్రై చేయండి
- Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
పెద్ద పొరపాటు..
చాలామంది చేసే సాధారణ పొరపాటు ఏమిటంటే, మిరపకాయలను కడిగిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడవుతాయి. ఒకవేళ కడగాల్సి వస్తే, పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నిల్వ చేయాలి. అలాగే ఫ్రిజ్‌లో తేమ తక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచడం మంచిది. మొత్తంగా సరైన పద్ధతిలో నిల్వ చేస్తే పచ్చిమిరపకాయలు చాలా వారాల పాటు తాజాగా ఉండే అవకాశం ఉంది. వాటి నాణ్యత, ఫ్రిజ్ ఉష్ణోగ్రత, నిల్వ చేసే విధానాన్ని బట్టి ఈ కాలం మారవచ్చు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మిరపకాయలను తరచూ కొనాల్సిన అవసరం తగ్గి, వంటింట్లో ఎప్పుడూ తాజా మిరపకాయలు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?