Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathroom Cleaning Tips: ఇంటి బాత్రూమ్ను ప్రతిరోజూ శుభ్రం చేసినప్పటికీ కుళాయిలు, సింక్లు, అద్దాలు, టైల్స్‌పై కనిపించే తెల్లటి లేదా పసుపు రంగు మరకలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి సాధారణ మురికి కాదు.. గట్టి నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పేరుకుపోవడం వల్ల ఏర్పడే ‘హార్డ్ వాటర్ స్టెయిన్స్’. వీటిని తొలగించేందుకు ఖరీదైన క్లీనర్లు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతో ఈ మరకలను సులభంగా తొలగించవచ్చు.
హార్డ్ వాటర్ మరకలు ఎందుకు వస్తాయి?
కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్న నీటిని హార్డ్ వాటర్ అంటారు. ఈ నీరు ఆరిపోయిన తర్వాత ఖనిజాలు ఉపరితలాలపై పేరుకుపోయి తెలుపు, పసుపు లేదా గోధుమ రంగు మరకలుగా మారతాయి. కుళాయిలు, షవర్లు, సింక్లు, అద్దాలు, బాత్రూమ్ టైల్స్‌పై ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
1. తెల్ల వెనిగర్‌తో సులభంగా శుభ్రం
కుళాయిలు, షవర్లు, గాజుపై ఏర్పడిన గట్టి నీటి మరకలను తొలగించడంలో తెల్ల వెనిగర్ మంచి ఫలితాన్ని ఇస్తుంది… అయితే, సమాన పాళ్లలో తెల్ల వెనిగర్, నీటిని కలిపి స్ప్రే బాటిల్లో పోయాలి. మరకలపై స్ప్రే చేసి 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత మెత్తని స్పాంజ్ లేదా బ్రష్‌తో మెల్లగా రుద్ది నీటితో కడగాలి. కానీ, మార్బుల్, గ్రానైట్ వంటి సహజ రాళ్లపై వెనిగర్ ఉపయోగించకూడదు..
2. బేకింగ్ సోడాతో టైల్స్ మెరుస్తాయి
బాత్రూమ్ టైల్స్, గ్రౌట్ లైన్లపై మరకలు ఉంటే బేకింగ్ సోడా మంచి పరిష్కారం అని చెప్పాలి.. అయితే, ఒక భాగం నీటికి రెండు భాగాలు బేకింగ్ సోడా కలిపి పేస్ట్ తయారు చేయాలి. మరకలపై పూసి 30 నిమిషాలు ఉంచాలి. పాత టూత్‌బ్రష్‌తో రుద్ది శుభ్రమైన నీటితో కడిగితే సరిపోతుంది..
3. టూత్‌పేస్ట్‌తో చిన్న మరకలు మాయం
గాజు లేదా కుళాయిలపై చిన్నపాటి మరకలను టూత్‌పేస్ట్‌తో కూడా తొలగించవచ్చు. మరకపై కొద్దిగా ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ రాయాలి. 30 నిమిషాలు ఉంచి స్పాంజ్ లేదా టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయాలి. అనంతరం నీటితో కడగాలి.
4. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో లోతులేని మరకలకు చెక్
లోతుగా పేరుకుపోని మరకలను హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో సులభంగా తొలగించవచ్చు. మరకపై హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ప్రే చేయాలి… 15 నిమిషాలు ఉంచిన తర్వాత మెత్తని బ్రష్‌తో శుభ్రం చేసి నీటితో కడగాలి.. ఈ సులభమైన గృహ చిట్కాలను పాటిస్తే బాత్రూమ్లోని కుళాయిలు, సింక్లు, అద్దాలు, టైల్స్ మళ్లీ కొత్తవిలా మెరుస్తాయి. అయితే ఏదైనా క్లీనింగ్ పద్ధతిని మొదట చిన్న భాగంలో పరీక్షించి, ఆ తర్వాత మొత్తం ఉపరితలంపై ఉపయోగించడం మంచిది.
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!