lizards: ఇంట్లో బల్లుల బెడదా? పైసా ఖర్చు లేకుండా శాశ్వతంగా తరిమికొట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
lizards: సాధారణంగా ఇంట్లో బల్లులు తిరగడం ఎవరికీ నచ్చదు. వాటి ఆకారాన్ని చూసి చాలా మంది భయపడుతుంటారు కూడా. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన స్ప్రేలు వాడటం కంటే, ఇంట్లోనే లభించే దొరికే వస్తువులతో బల్లులను శాశ్వతంగా ఎలా తరిమికొట్టవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిరియాల పొడి ఘాటైన వాసనను బల్లులు అస్సలు భరించలేవు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కొన్ని మిరియాలను దంచి, ఆ పొడిని నీటిలో కలిపి ఒక బాటిల్లో పోసుకోవాలి. తర్వాత బల్లులు తిరిగే ప్రదేశాలలో ఈ వాటర్‌ను స్ప్రే చేయడం వల్ల అవి వెంటనే పారిపోతాయి. అలాగే వెల్లుల్లి ఘాటు కూడా బల్లులను దూరం పెట్టడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి రెబ్బల నుంచి రసాన్ని తీసి, దానికి కొద్దిగా నీరు కలిపి గోడలపై స్ప్రే చేయడం వల్ల బల్లుల బెడద తప్పుతుంది. వీటితో పాటు బల్లులకు పక్షుల ఈకలను చూస్తే భయం వేస్తుంది. ముఖ్యంగా నెమలి ఈకలు కదులుతుంటే బల్లులు భయపడి పారిపోతాయి. బల్లులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో నెమలి ఈకలను వేలాడదీయడం మంచి ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు.
Also Read
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
కోడిగుడ్డును ఉపయోగించిన తర్వాత మిగిలిన ఖాళీ పెంకులకు దారం కట్టి, ఇంట్లోని ట్యూబ్లైట్ల వద్ద లేదా బల్లులు తిరిగే చోట అమర్చాలి. ఎందుకంటే ఈ గుడ్డు పచ్చి వాసన బల్లులకు పడదు. ఈ పెంకులు పచ్చి వాసన వచ్చే వరకు ఉంచి, ఆ తర్వాత కొత్త వాటిని మార్చుకోంటే మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. బల్లులకు చల్లని వాతావరణం పడదు. వాటి శరీరం చలిని తట్టుకోలేదు. అందుకే బల్లులపై చల్లని ఐస్ వాటర్ స్ప్రే చేసినా లేదా గదిలో ఏసీ ఆన్ చేసినా అవి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. అలాగే కాఫీ పొడి – పొగాకు పొడిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి బల్లులు తిరిగే చోట ఉంచాలి. ఈ చిట్కా బల్లులను ఇంటి నుంచి తరిమేయడానికి చాలా బాగా పనిచేస్తుంది.
ఉల్లిపాయను దంచి రసం తీసి నీటిలో కలిపి స్ప్రే చేస్తే బల్లలు అక్కడి నుంచి పరార్ అవుతాయని చెబుతున్నారు. నాఫ్తలిన్ బాల్స్ (రంగు బిళ్ళలు) లేదా కర్పూరం బిళ్ళలను బల్లులు తిరిగే ప్రదేశాలలో ఉంచడం వల్ల వాటి వాసనకు కూడా బల్లులు రావని చెబుతున్నారు. ఈ నాచురల్ టిప్స్ పాటిస్తూనే, ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో చెత్తాచెదారం లేకుండా క్లీన్‌గా ఉంచుకుంటే బల్లులు అసలు లోపలికే రావని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!