Site icon NTV Telugu

Sleep Paralysis: నిద్రలో దెయ్యం ఛాతిపై కూర్చొని మెడ నొక్కేస్తున్నట్టు అనిపించిందా..?

Sleep Paralysis

Sleep Paralysis

రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు పీడకలలు రావడం సర్వసాధారణం. కొన్ని సార్లు ఛాతిపై బరువుగా.. ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తోంది. నిద్రలో గుండెలపై దెయ్యం కూర్చుందని నోటిలో మాటలు సైతం రావడం లేదని చెబుతూ ఉంటారు. ఎవరో కూర్చుని, పీకనులుముతున్నట్లు అనిపిస్తుంటుంది. గట్టిగా అరవాలని ఉన్నా.. నోటి నుంచి మాట బయటకు రాదు. ఎంత ప్రయత్నించినా శరీరాన్ని కదిలించలేక పోతాం. దెయ్యం గుండెలపై కూర్చుని పీక నొక్కేసిందని చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే దయ్యం గుండెల మీద కూర్చుని పీక నొక్కుతుందా? లేదా అది మన భ్రమ మాత్రమేనా? పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..

READ MORE: Shreya Dhanwanthary : ముద్దు సీన్ తీసేస్తారా.. సెన్సార్ బోర్డుపై నటి ఫైర్..

నిపుణులు వివరణ ప్రకారం.. ఇలా జరగడాన్ని ‘నిద్ర పక్షవాతం’ లేదా స్లీప్ పెరాలసిస్ అంటారు. ఇది రాత్రి పూట నిద్ర సమయాలలో సాధారణంగా సంభవిస్తుందట. ఈ నిద్ర పక్షవాతం అనేది జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపించగలదు. కొంత మందికి దీనితో పాటు హేలూసినేషన్స్ కూడా వస్తాయి. స్లీప్ పెరాలసిస్ సంభవించినప్పుడు.. ఒక పీడకలలా ఉంటుంది. నిద్రలేచినట్లు ఉంటుంది కానీ లేవలేం. లేవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా.. శరీరంలోని అవయవాలు ఏ మాత్రం సహకరించవు. విచిత్రం ఏమిటంటే.. ఆ వ్యక్తులు చూడటానికి నిద్రపోతున్నట్లు ఉంటారు. కానీ.. ఎవరో తనకు హాని చేస్తున్న అనుభూతి పొందుతారు.

READ MORE: MSRTC: మద్యం మత్తులో డ్రైవర్, కండక్టర్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

ఎవరో తన దగ్గరకి వచ్చి ఛాతీపై కూర్చుని చంపేయడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తారు. తప్పించుకోవాలని చూసినా కదలలేడు. ఇలాంటి ఫీలింగ్‌ సాధారణంగా అందరికీ ఒక్కో సమయంలో అనిపించేవే. అయితే అది సాధారణంగా కొన్ని సెకన్లు మాత్రమే అలాంటి ఫీలింగ్‌ ఉంటుంది. కొందరికి అదొక భయానక అనుభవంగా మారుతుంది. ఈ నిద్ర పక్షవాతం నిద్రలేమి, రాత్రిపూట సరిగా నిద్రపోక పోవడం, నార్కోలెప్పీ, ఒత్తిడి, ఆందోళన, వివిధ భయాలు తదితర రుగ్మతలు ఉన్నా లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ పరిస్థితి ఉంటే.. అది వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version