NTV Telugu Site icon

Glowing Skin: బియ్యం కడిగిన నీళ్లతో చర్మ సౌదర్యం..ట్రై చేయండి..

Skin Care

Skin Care

అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. అన్నం తినడం వల్ల శరీరానికి బలమే కాదు.. బియ్యాన్ని కడిగే నీళ్లలో కూడా లెక్కలేనన్ని పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ బియ్యాన్ని బాగా కడగటం మాత్రం మరచిపోవద్దు. బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టి.. ఆ నీటిని శరీరం, చర్మ ఆరోగ్యంలో భాగంగా ఉపయోగించవచ్చు. ఈ రైస్ వాటర్ ప్రధానంగా కొరియన్ చర్మ సంరక్షణలో చాలా మంది ఉపయోగిస్తారు. ఇది ఫైన్ లైన్స్, ముడతలు తగ్గించి, చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది.

READ MORE: JPL 2024: ఆంధ్రజ్యోతిపై ఘన విజయం.. జేపీఎల్ 2024 ఫైనల్లో ఎన్టీవీ!

రైస్ వాటర్‌లో విటమిన్లు , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి. బియ్యం కడిగిన నీటిలో ఫెరులిక్ యాసిడ్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అల్లాంటోయిన్ ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. బియ్యం నీళ్లను చర్మానికి పట్టించి కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. రైస్ వాటర్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు విసుగు చెందిన చర్మాన్ని నయం చేస్తాయి. ఎగ్జిమా, మొటిమలు వంటి సమస్యలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఇది నల్ల మచ్చలు, మంట ఎరుపు వంటి చర్మ సమస్యలను కూడా తగ్గుతాయి. బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మంలోని రంధ్రాల రూపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. మీ చర్మం మెరుస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యలతో బాధపడేవారు రోజూ బియ్యం నీళ్లను ముఖానికి రాసుకోవచ్చు. మంచి ఫలితాలు పొందండి.