పల్లెటూర్లలో పొట్టివాడు గట్టివాడు అంటారు. అలాగే అమ్మాయినైతే పొట్టిది గట్టిది అంటూ పాడుతుంటారు. పొట్టిదాయి కాదమ్మో.. గట్టిదాయమ్మో.. పావుశేరు ముక్కుపుడక ఎక్కువాయమ్మో.. అంటూ రమణ పాడిన పాట అలరించింది. ఈ జానపదాల పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఒక్కో సీజన్ లో ఒక్కో పాట జనం నోట్లో నానుతూ వుంటుంది. ఇప్పుడు మాత్రం రమణ రేల పాటలు యూత్ ని ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో రమణ రేల సంచలనం కలిగించారు. అబ్బబ్బ ఇది పిల్లకాదురా.. పనస పండురా.. దాని బుగ్గపైన ముద్దుపెడితే భలేగుందిరా.. అంటూ అమ్మీ అమ్మీ.. నా కోసం కన్నాదమ్మీ అంటూ అమ్మాయికి ప్రపోజ్ చేసే రమణ రేల పాట అందరినీ ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందడి సందర్భంగా వనిత టీవీలో ప్రసారమయిన ఈ సాంగ్ వైరల్ అవుతోంది.