Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mushroom Pulao: వారాంతాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లోనే ఏదైనా స్పెషల్ వంటకం చేసుకొవాలన్నప్పుడు చాలామందికి గుర్తుకు వచ్చేది “బిర్యానీ లేదా పులావ్”. ముఖ్యంగా నాన్‌వెజ్ తినని వారికి, లేదా నాన్‌వెజ్‌కు ఏమాత్రం తీసిపోని రుచితో పాటు పుష్కలమైన ప్రొటీన్ అందించే హెల్తీ ఆప్షన్ కావాలనుకునే వారికి మష్రూమ్ పులావ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
సాధారణంగా పులావ్ అంటే ఏదో ఒక సైడ్ డిష్ లేదా కుర్మా అవసరం పడుతుంటుంది. కానీ.. జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, పెరుగులతో ప్రత్యేకంగా నూరిన మసాలా పేస్ట్‌తో చేసే ఈ పులావ్‌కు ఎలాంటి గ్రేవీ అవసరం ఉండదు. కేవలం చల్లని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలు, కడుపు నిండా సంతృప్తిగా తినేయొచ్చు. తక్కువ శ్రమతో, బ్యాచిలర్స్ సైతం క్షణాల్లో తయారుచేసుకోగల ఈ టేస్టీ అండ్ రిచ్ మష్రూమ్ పులావ్‌ను పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
Also Read
- Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
- CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
కావలసిన పదార్థాలు
* బటన్ మష్రూమ్స్: 400 గ్రాములు (2 ప్యాకెట్లు)
* బియ్యం: 2 గ్లాసులు (400 గ్రాములు – సాధారణ బియ్యం, బాస్మతి లేదా చిట్టి ముత్యాలు)
* నీరు: 4 గ్లాసులు (బియ్యానికి రెట్టింపు పరిమాణంలో)
* నూనె: 6 టేబుల్ స్పూన్లు
* నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
మసాలా పేస్ట్ కోసం:
* ఉల్లిపాయ: 1 (పెద్ద ముక్కలుగా తరిగినవి)
* అల్లం తరుగు: 2 టేబుల్ స్పూన్లు
* వెల్లుల్లి రెబ్బలు: 2 టేబుల్ స్పూన్లు
* పచ్చిమిర్చి: 10
* జీడిపప్పు: 10
* పుదీనా ఆకులు: 1 కప్పు
* కొత్తిమీర తరుగు: 1 కప్పు
* పెరుగు: అర కప్పు (1/2 cup)
* ఉప్పు: తగినంత,
* నూనె: 1 టేబుల్ స్పూన్
తాలింపు & పులావ్ కోసం
* గరం మసాలా: 1 టీస్పూన్ మిరియాలు, కొద్దిగా దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు
* జీలకర్ర: 1 టీస్పూన్
* బిర్యానీ ఆకులు: 2
* సన్నగా తరిగిన ఉల్లిపాయలు: ముప్పావు కప్పు
* టమాటాలు: 2 (మీడియం సైజు, సన్నని ముక్కలు)
* ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
* పసుపు: పావు టీస్పూన్
* కరివేపాకు: కొద్దిగా
* ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విదానం..
మష్రూమ్స్, బియ్యం సిద్ధం చేసుకోవాలి
ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇందుకోసం మష్రూమ్స్‌పై కాస్త గోధుమపిండి, కొద్దిగా నీళ్లు చల్లి చేత్తో సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత రెండు మూడు సార్లు మంచి నీటితో కడిగితే వాటిపై ఉన్న మట్టి, దుమ్ము తొలగిపోతాయి. క్లీన్ చేసిన మష్రూమ్స్‌ను వాటి సైజును బట్టి రెండు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టాలి.
గ్రీన్ మసాలా పేస్ట్ తయారీ
ఇప్పుడు పులావ్‌కు ప్రత్యేకమైన గ్రీన్ మసాలా పేస్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని, అర కప్పు పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మసాలా గ్రేవీని సిద్ధం
పులావ్ వండేందుకు ముందుగా వేరొక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. ఈ నీటిని తర్వాత ఎసరుగా ఉపయోగించాలి. ఇప్పుడు బిర్యానీ పాట్ లేదా వెడల్పాటి కుక్కర్‌ను స్టవ్‌పై పెట్టి ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల నూనె, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి టమాటాలు మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు మగ్గించాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి.
గ్రేవీకి రుచి
ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్‌ను వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించాలి. మష్రూమ్స్ నుంచి నీరు ఊరి, నూనె పైకి తేలడం ప్రారంభమైన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్‌ను వేసి కలపాలి. పచ్చి వాసన పోయేలా మరో రెండు మూడు నిమిషాలు మగ్గించాలి.
బియ్యం వేసి పులావ్
నూనె పైకి తేలిన తర్వాత అరగంట పాటు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా తీసి మసాలాలో వేయాలి. మసాలా మొత్తం బియ్యానికి బాగా పట్టేలా సన్నని మంటలో సుమారు ఐదు నిమిషాలు నెమ్మదిగా కలపాలి. అనంతరం పక్కన మరిగిస్తున్న నాలుగు గ్లాసుల వేడి నీళ్లను ఇందులో పోసి, రుచి చూసి సరిపడా ఉప్పును సర్దుబాటు చేయాలి.
చివరగా దమ్
బిర్యానీ పాట్లో వండుతున్నట్లయితే మూత పెట్టి లో ఫ్లేమ్‌లో నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో వండేవారు నీటి పరిమాణాన్ని కొద్దిగా తగ్గించి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒకటి నుంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నీరంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే మూత తీయకుండా కనీసం 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్నం మెతుకు మెతుకుగా, పొడిపొడిగా చక్కగా సెట్ అవుతుంది. చివరగా వేడి వేడి మష్రూమ్ పులావ్‌ను ఉల్లిపాయ రైతాతో వడ్డిస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!