Relationship: దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలివేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఒక్కోసారి భర్త దగ్గర భార్య.. అలాగే భార్య దగ్గర భర్త చిన్న విషయాల్లో అబద్ధాలు ఆడుతుంటారు. అవి చిన్నవే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ నిజం నిప్పు లాంటిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. అబద్ధాల వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం సడలిపోతుంది. నిజానిజాలు తెలిశాక వాళ్ల జీవితంలో చాలా పెద్ద సమస్యలు పుట్టుకొస్తాయి. అందువల్ల భాగస్వామి దగ్గర నిజాయితీగా ఉండండి.
Read Also: Tirumala: భక్తులకు శుభవార్త.. అందుబాటులో 2023 డైరీలు, క్యాలెండర్లు
దాంపత్య జీవితంలో భాగస్వామిని అనుమానించడం వల్ల రిలేషన్ షిప్‌లో చీలికలు ఏర్పడతాయి. అందువల్ల అనుమానాలకు తావిచ్చే విషయాలను దూరంగా ఉంచండి. ఒకవేళ అనుమానం ఉంటే అప్పటికప్పుడే తేల్చుకోండి. ముఖ్యంగా చిన్న చిన్న గొడవలను పెద్దవిగా చేసుకోకుండా ప్రేమతో మసులుకోండి. ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య, భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడు ప్రవర్తించకూడదు. భార్యాభర్తలు తమ భాగస్వామి వ్యక్తిత్వాన్ని వేరే వ్యక్తుల వద్ద అగౌరపరిచేలా ప్రవర్తించకూడదు. భార్యాభర్తల మధ్య తరచూ ఓ కారణం వివాదానికి దారితీస్తుంది. నా బర్త్‌డే కూడా మరిచిపోయారని.. తనకు విషెస్ కూడా చెప్పలేదని కొందరు భాగస్వామిపై అలక చెందుతుంటారు. పుట్టినరోజు లేదా పెళ్లిరోజు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొందరు బిజీ లైఫ్ వల్ల ఇలాంటి విషయాలను మరిచిపోతుంటారు. కానీ ఈ కారణాలు భార్యాభర్తల మధ్య గ్యాప్ మరింత పెంచుతాయి.తమ భాగస్వామికి తాము ముఖ్యం కాదనే భావన వారిలో కలుగుతుంది. అందువల్ల ప్రత్యేకమైన రోజులను మరవకుండా స్పెషల్‌గా ప్లాన్ చేసుకోండి.
Read Also: Coconut Oil : వావ్.. పరగడుపున కొబ్బరినూనె తాగితే ఇన్ని ప్రయోజనాలా..!