NTV Telugu Site icon

Parenting Tips: పరీక్షలు దగ్గర పడుతున్నాయ్… మీ పిల్లలు బాగా చదవాలంటే ఇలా చేయండి..

Parenting Tips

Parenting Tips

కొంత మంది పిల్లలు చదువులో బాగా రానిస్తారు. ఒక్కసారి చదివిన వారు మంచిగా గుర్తుపెట్టుకుని మంచి మంచి ర్యాంకులు సొంతం చేసుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు మాత్రం చదువుల్లో వెనుకబడిపోతారు. ఎన్ని సార్లు చదివిన వారికి గుర్తు ఉండదు. దీంతో ఫెయిల్ అవుతారు. ఈ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అయితే.. ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు పిల్లలను బాగా ప్రిపేర్ చేసేందుకు తల్లిదండ్రులు ఈ టిప్స్ పాటించండి..

READ MORE: Andhra Pradesh: లోకాయుక్త ఆదేశాలు.. 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..

పిల్లలకు ఒక టైమ్‌ టేబుల్‌ను తయారు చేసిన ఇవ్వండి. వారు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్‌ చదవాలి? ఎన్ని చదవాలి ? అనే అంశాలను అందులో పొందుపరచండి. దీనివల్ల పిల్లలు సులభంగా చదువుతారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటి రాగానే హోమ్‌వర్క్‌ చేయాలంటే, అలాగే టీచర్‌లు చెప్పిన పాఠాలను చదవాలంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కాబట్టి, వారు చదువుకునే టైమ్‌లో టీవీ ఆఫ్ చేయండి. వీలైతే ఇంట్లో వారికి ఒక స్టడీ రూమ్‌ను ఏర్పాటు చేయండి. దీనివల్ల పిల్లలు బాగా చదివే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.

READ MORE: Cars Price Hike: కారు కొనాలని చూస్తున్నారా.. ఈ కార్ల ధరలు పెరిగాయి, చెక్ చేసుకోండి

గణితం, సైన్స్‌ వంటి కొన్ని సబ్జెక్టులు కొంచెం కష్టంగా ఉంటాయి. కొన్ని సార్లు పిల్లలకు అవి అర్థం కాకపోవచ్చు. కాబట్టి, మీ పిల్లలకు ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తున్నాయి? ఎందులో ఫెయిల్‌ అవుతున్నారో గుర్తించండి. తర్వాత వారిని మీరు దగ్గర ఉండి చదివించండి. ఇంకా వారు ఆ సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ట్యూషన్‌లో చేర్పించండి. తల్లిదండ్రులు పిల్లలతో క్లోజ్‌గా ఉంటూ.. వారిని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించండి. తర్వాత వారు మీరు అనుకున్నట్లుగా ఎక్కువ మార్కులు సాధిస్తే వారికి గిఫ్ట్‌లను అందించండి. ఇలా చేయడం వల్ల వారికి చదువు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా అని ఎప్పుడూ పిల్లలను చదవమని కోపంగా చెబితే మొదటికే మోసం వస్తుంది.