ఇప్పుడు హెడ్‌ఫోన్స్ ఓ ట్రెండ్‌గా మారిపోయింది.. హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ ఇలా రకరకాల పరికరాలను చెవుల్లో పెట్టుకుని భారీ శబ్దాలతో సినిమాలు చూస్తున్నారు, మ్యూజిక్ ఆశ్వాదిస్తున్నారు.. పక్కనవారు ఏమైనా మాట్లాడినా? ఏదైనా చెప్పినా కూడా వినిపించకపోవడంతో.. పట్టించుకోవడం లేదు.. అలా మారిపోయింది పరిస్థితి.. అయితే, హెడ్‌ఫోన్స్, ఇయర్‌బర్డ్స్ వంటివి వాడడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి వినికిడి ముప్పు పొంచిఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది.. ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా హెడ్‌ఫోన్లు, ఇయర్ బర్డ్స్ లాంటివి వాడుతూ.. పెద్ద శబ్దాలతో మ్యూజిక్ ఆలకించడం క్రమంగా పెరిగిపోతున్న తరుణంలో.. ఓ సర్వే అందరి మదిలో గుబులురేపుతోంది.. ఆ సర్వే ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా యుక్తవయసు పిల్లలు, యువతలో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని ఆ అధ్యయనం హెచ్చరించింది..
Read Also: Superstar Krishna: అశ్రు నయనాలతో తండ్రి చితికి నిప్పంటించిన మహేష్
ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 43 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఇయర్‌ఫోన్స్.. ఇతర పరికరాల వినియోగంపై అమెరికాలోని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా పరిశోధకుల బృందం ఓ అధ్యయనం నిర్వహించింది.. ఏ ఏజ్ వారు ఎంత శబ్ధం వింటే మంచిదనే దానిపై కూడా కొన్ని గణాంకాలు బయటపెట్టాంది.. సాధారణంగా పెద్దవారిలో 80 డెసిబెల్స్ , పిల్లల్లో 75 డీబీ శబ్దం మించకూడదు హెచ్చరించింది.. అయితే, ప్రస్తుతం ఈ పరికరాలు వినియోగించే వారు సరాసరి 105 డెసిబెల్ శబ్దాన్ని వింటున్నట్టు ఆ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో యువతలో వినికిడి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికైనా రెగ్యులర్‌గా హెడ్‌సెట్స్, ఇయర్ బర్డ్స్, ఇతర పరికరాలు వాడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్ అంటున్నారు వైద్యులు.